సమంత మిస్సయ్యింది.. అక్కినేని ఇంట సందడి.. నాగార్జున-అమల 25వ వివాహమహోత్సవం
అక్కినేని ఇంట సందడి నెలకొంది. నాగార్జున- అమల దంపతులకు పెళ్లయి 25 ఏళ్లు గడిచాయి. ఈ పెళ్లి రోజు వేడుకను అక్కినేని కుటుంబం మొత్తం కలిసి జరుపుకున్నారు. బంధువులు, ఆప్తులు, స్నేహితుల మధ్య జరుపుకున్నారు. ఈ
అక్కినేని ఇంట సందడి నెలకొంది. నాగార్జున- అమల దంపతులకు పెళ్లయి 25 ఏళ్లు గడిచాయి. ఈ పెళ్లి రోజు వేడుకను అక్కినేని కుటుంబం మొత్తం కలిసి జరుపుకున్నారు. బంధువులు, ఆప్తులు, స్నేహితుల మధ్య జరుపుకున్నారు. ఈ నాగ్-అమల పెళ్లి రోజు వేడుకను అఖిల్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. నేను ఎంతగానో ప్రేమించే అమ్మానాన్నలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ఎంత గొప్ప ప్రేమకథ అంటూ ట్వీట్ చేశాడు అఖిల్. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. అయితే ఈ ఫ్యామిలీ ఫోటోలో ఇంటి కొత్త కోడలు, హీరోయిన్ మిస్ అయ్యింది. ఈ ఫంక్షన్లో భర్త చైతూ వుండగా, సమంత మిస్ కావడంపై నెటిజన్ల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి. అయితే ఓ అభిమాని.. ఫొటోషాట్ ద్వారా సమంత ఫొటోను యాడ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
షూటింగ్ బిజీలో ఉండటం వల్ల చెన్నైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఫ్యామిలీకి దూరం కావడం మిస్ అవుతున్నందుకు బాధగా ఉందంటూ సమంత నెగటివ్ కామెంట్స్‌కు స్వస్తి చెప్పింది.