Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Anil Ravipudi: ట్రెండ్ కు తగ్గ చిత్రంగా మటన్ సూప్ : అనిల్ రావిపూడి

Advertiesment
Anil Ravipudi, Ramachandra Vattikuti, Rambabu parvataneni and others

చిత్రాసేన్

, బుధవారం, 1 అక్టోబరు 2025 (16:57 IST)
Anil Ravipudi, Ramachandra Vattikuti, Rambabu parvataneni and others
రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం మటన్ సూప్. విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌ ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి నిర్మాతలుగా రానున్న ఈ నూతన చిత్రానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో ఆకట్టుకున్నాయి. దసరా సందర్భంగా బుధవారం, అక్టోబర్ 1 నాడు చిత్ర టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ* .. ‘మటన్ సూప్ టైటిల్ తోపాటు టీజర్ బాగుంది. టీం కూడా చాలా కొత్తగా ఉంది. దర్శకుడు రామచంద్రకు, హీరో రమణ్‌కు, సినిమా టీంకు ఆల్ ది బెస్ట్.  అక్టోబర్ 10న చిత్రం రాబోతోంది. అందరూ చూసి పెద్ద సక్సెస్ చేయాలి అని అన్నారు.
 
నిర్మాత మల్లిఖార్జున ఎలికా (గోపాల్) మాట్లాడుతూ* ..అనిల్ రావిపూడి గారు మా టీజర్‌ను లాంఛ్ చేయడం ఆనందంగా ఉంది. మంచి స్క్రీన్ ప్లేతో మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ, అనిల్ రావిపూడి గారు టీజర్‌ను లాంఛ్ చేయడం అదృష్టం. మా నిర్మాతలు నాకు ఎంతో అండగా నిలిచారు. రమణ్ గొప్పగా నటించారు. మా అందరినీ ముందుండి నడిపిస్తున్న పర్వతనేని రాంబాబు కి థాంక్స్. మా సినిమా అక్టోబర్ 10న రాబోతోంది. అందరూ పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
 
నిర్మాతలు రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి మాట్లాడుతూ, ట్రెండ్‌కు తగ్గ కథ. అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా అవుతుంది. దర్శకుడు రామచంద్ర సినిమాను చక్కగా తెరకెక్కించారు అన్నారు.
 
హీరో రమణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు, నటులు జెమినీ సురేష్, గోవింద్ మాట్లాడుతూ, అందరూ వీక్షించి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tarun Bhaskar: గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే కాన్సెప్ట్ తో బా బా బ్లాక్ షీప్ : తరుణ్ భాస్కర్