Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JD Chakravarthy: డబ్బుని మంచినీళ్లు లాగా ఖర్చు పెడుతున్నారు : జెడీ చక్రవర్తి

Advertiesment
JD Chakravarthy, Naresh Agastya, Seerat Kapoor, Shravan Jonnada,  Shiva Kumar

దేవీ

, శనివారం, 6 సెప్టెంబరు 2025 (09:19 IST)
JD Chakravarthy, Naresh Agastya, Seerat Kapoor, Shravan Jonnada, Shiva Kumar
జెడి చక్రవర్తి, నరేష్ అగస్త్య, సీరత్ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ జాతస్య మరణం ధ్రువం. శ్రవణ్ జొన్నాడ రచన, దర్శకత్వం వహించగా, త్రిష సమర్పణలో సురక్ష్ బ్యానర్‌పై మల్కాపురం శివ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ప్రీతీ జంఘియానీ రీఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.
 
జె.డి చక్రవర్ మాట్లాడుతూ..పోస్ట్ ప్రొడక్షన్ ముంబైలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నారు. సినిమా కోసం డబ్బుని మంచినీళ్లు లాగా ఖర్చు పెడుతున్నారు. మా అందరికంటే సినిమాని ఆయనే ఎక్కువగా బిలీవ్ చేశారు. సీరత్ మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్, సింగర్. తనకి సినిమా అంటే పిచ్చి. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ అందరికీ నచ్చుతుంది. నరేష్ కి నాకు చాలా పోలికలు ఉన్నాయి. తనకి చాలా మొహమాటం. డైరెక్టర్ శ్రవణ్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. జాతస్య మరణం ధ్రువం టైటిల్ సజెస్ట్ చేసింది నేనే. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు.
 
హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. జేడీ గారి ఇంపాక్ట్ నా మీద చాలా వుంది. గులాబీలో చేసిన  బైక్ సాంగ్ వల్ల నేను బైక్స్ మీద 70 లాక్స్ ఇన్వెస్ట్ చేశాను. మా ఇద్దరికీ బైక్స్ అంటే చాలా ఇష్టం. నిర్మాత శివ గారు చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ట్విస్టులు చాలా బాగుంటాయి. తప్పకుండా సినిమా మీ అందరిని అలరిస్తుంది.
 
డైరెక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ... జేడీ చక్రవర్తి గారు స్క్రిప్ట్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా ప్రతి అడుగులో సపోర్ట్ చేశారు. ఈ టైటిల్ సూచించింది ఆయనే. నరేష్ అగస్త్య, సీరత్ కపూర్, నిర్మాత శివకుమార్ గారు చాలా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను
 
సీరత్ కపూర్ మాట్లాడుతూ.. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాల్లోనే నాకు మంచి పేరు వచ్చింది. తెలుగు సినిమా ఎప్పుడు చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నరేష్ చాలా టాలెంటెడ్ యాక్టర్. తనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా యూనిక్ సినిమా. సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.
 
నిర్మాత మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ.. సీరత్ ప్రమోషన్స్ లో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. నరేష్ చాలా టాలెంటెడ్.  డైరెక్టర్ గారు సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమా  ఖచ్చితంగా విజయం సాధించి తనకి భవిష్యత్తులో మరెన్నో మంచి అవకాశాలు వస్తాయి. తమ్ముడు హీరోయిన్ ప్రీతీ జంఘియానీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. తన పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది పాన్ ఇండియా మూవీ. పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ కంటెంట్ మీద మాకు అంత నమ్మకం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nani: మోహన్ బాబు కీలక పాత్రలో నాని ది ప్యారడైజ్ చిత్రం