Brahma Brahmanandam, Yogi babu and Gurram Papireddy team
"గుర్రం పాపిరెడ్డి" సినిమా నాకొక స్పెషల్ మూవీ అని చెప్పగలను. ఎందుకంటే యంగ్ స్టర్స్ అంతా కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో జడ్జి పాత్రలో నటించాను. దర్శకుడు మురళీ మనోహర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్నవాడు. నన్ను ఈ మూవీలో డిఫరెంట్ గా చూపించాడు. ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్ వీళ్లతో పాటు నేను మిమ్మల్ని నవ్వించేందుకు ప్రయత్నించాను. అలాగే యోగిబాబు ఈ మూవీకి స్పెషల్ అట్రాక్షన్. ఇవాళ తమిళ చిత్ర పరిశ్రమలో యోగిబాబుకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనకు తెలుసు అని హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మాట్లాడారు.
నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" సినిమా టీజర్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబుతో పాటు మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం తెలుపుతూ, ఇటీవల యోగిబాబు హీరోగా నటించిన ఓ కన్నడ చిత్రంలో నేను నటించాను. ఆయన బయట చాలా కామ్ గా ఉంటారు. ఈయన కామెడీ చేస్తారని అనుకోం. కానీ కామెడీని పండించడంలో దిట్ట యోగిబాబు. ఇలా వీళ్లందరితో కలిసి నటించడం మంచి ఎక్సీపీరియన్స్ ఇచ్చింది. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే మన సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. హీరో నరేష్, హీరోయిన్ ఫరియా సహా "గుర్రం పాపిరెడ్డి" సినిమా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
కామెడీ సూపర్ స్టార్ యోగిబాబు మాట్లాడుతూ - "గుర్రం పాపిరెడ్డి" సినిమా ద్వారా నేరుగా తెలుగు ఆడియెన్స్ ముందుకు రావడం హ్యాపీగా ఉంది. మా హీరో నరేష్, హీరోయిన్ ఫరియా, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సహా మా టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. బ్రహ్మానందం గారితో కలిసి నటించడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. నేను చేసిన సార్ మేడమ్ సినిమాను తెలుగు ఆడియెన్స్ బాగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఆ పాత్ర ఉంటుంది. "గుర్రం పాపిరెడ్డి" సక్సెస్ మీట్ లో తప్పకుండా తెలుగులో మాట్లాడుతా. అన్నారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ - ఈ చిత్రంలో సౌధామిని అనే పాత్రలో నటించాను. బ్రహ్మానందం, యోగి బాబు వంటి పెద్దలతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా నేను ఒప్పుకునేందుకు నరేష్ అగస్త్య ఒక రీజన్. ఇలాంటి మంచి నటుడితో మూవీ చేయాలని అనిపించేది. ఈ సినిమాలో నటించేప్పుడు ప్రొడ్యూసర్స్ మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకున్నారు. మా మదర్ ఈ చిత్రంలో చిన్న అతిథి పాత్రలో నటించింది. ఈ సినిమాకు వర్క్ చేయడం సూపర్ ఎగ్జైట్ మెంట్ ఇచ్చింది. ఇందులో ఒక సాంగ్ చేస్తున్నా, ఆ పాట స్పెషల్ గా ఉంటుంది. అన్నారు.
నటీనటులు - నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్, తదితరులు