Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేష్ అగస్త్య కొత్త చిత్రం మేఘాలు చెప్పిన ప్రేమ కథ

Advertiesment
Meghala prema katha

దేవీ

, గురువారం, 27 మార్చి 2025 (16:38 IST)
Meghala prema katha
మత్తువదలరా, సూపర్ హిట్ సిరీస్ వికటకవిలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న హీరో నరేష్ అగస్త్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ సైన్ చేశారు- విపిన్ దర్శకత్వంలో సునేత్ర ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ఉమా దేవి కోట నిర్మించిన ఈ మూవీ కంటెంట్-రిచ్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేస్తారు.
 
కూల్, బ్రీజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు. ఈ సినిమాకు 'మేఘాలు చెప్పిన ప్రేమ కథ' అనే ప్లజెంట్ టైటిల్ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నరేష్ అగస్త్య చీర్ ఫుల్ అవతార్‌లో ఆకట్టుకున్నారు. రబియా ఖటూన్  ఛార్మింగ్ గా కనిపించింది. వారి మధ్య  పొగమంచు కొండ ప్రాంతం, ప్రశాంతమైన నేపథ్యం మధ్య ఉంచబడిన గిటార్ మూవీ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ ని సూచిస్తుంది. ఇది లవ్, డ్రీమ్స్, బ్యూటీఫుల్ కథని తెలియేస్తోంది.
 
సుమన్, ఆమని ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
ఈ మూవీకి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మోహన కృష్ణ సినిమాటోగ్రఫీ, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి, వెటరన్ తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్.  
 
మేఘలు చెప్పిన ప్రేమ కథ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది.  
 
తారాగణం: నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్, రాధిక శరత్‌కుమార్, తనికెళ్ల భరణి, వెంకటేష్ కాకుమాను, విద్యుల్లేఖ, సుమన్, ఆమని, తులసి, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ కార్తికేయ, మోహన్ రామన్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్క్రిప్ట్, దర్శకుడి ని బట్టి సినిమాలు అంగీకరిస్తున్నా : కామాక్షి భాస్కర్ల