Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 25 February 2025
webdunia

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ను కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

Advertiesment
Sarath Kumar, Bhupendra Patel, Mohan Babu, Vishnu Manchu

డీవీ

, బుధవారం, 29 జనవరి 2025 (16:23 IST)
Sarath Kumar, Bhupendra Patel, Mohan Babu, Vishnu Manchu
లెజెండరీ నటుడు మోహన్ బాబు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటుగా ప్రమోషన్స్‌ కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. ఈ   ప్రమోషనల్ టూర్‌లో భాగంగా కన్నప్ప టీమ్ దేశవ్యాప్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శిస్తోంది.
 
ఈ క్రమంలో మోహన్ బాబు, విష్ణు మంచు గుజరాత్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ భూపేంద్ర పటేల్ గారిని కలిశారు. ఈ టూర్‌లో శరత్ కుమార్, ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి కూడా సందడి చేశారు.
 
ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ అతిథి మర్యాదలకు, పలికిన సాదర స్వాగతాలకు కన్నప్ప టీం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.  ప్రముఖ తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల అందమైన పెయింటింగ్‌ను విష్ణు మంచు ముఖ్యమంత్రికి బహుకరించారు. కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నప్పలో విష్ణు మంచు, ప్రభాస్ పోరాట సన్నివేశాలు