టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతిహాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం "క్రాక్". ఈ మూవీ నుంచి మాస్ బిర్యానీ సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. "ఓసి నా క్లాస్ కల్యాణి... పెట్టవే మాస్ బిర్యాని" అంటూ సాగే ఈ పాట ఊర మాస్ స్టెప్పులతో దుమ్మురేపుతోంది.
రవితేజ - శృతిహాసన్ కాంబినేషన్ మరోసారి థియేటర్లలో రచ్చ చేస్తుందని ఈ పాట చూస్తే తెలిసిపోతుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రాహుల్ నంబియార్, సాహితి చాగంటి పాడారు. రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం క్రాక్ కావడంతో దీనిపై భారీ ఆశలే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కాగా, సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుంది.