Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా నాన్న చేసిన అతిపెద్ద తప్పు అదే : మంచు విష్ణు

manchu vishnu

ఠాగూర్

, బుధవారం, 11 డిశెంబరు 2024 (17:31 IST)
మా నాన్న మోహన్ బాబు అతిపెద్ద తప్పు మా అక్క మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్, తనను అమితంగా ప్రేమించడమేనని హీరో మంచు విష్ణు చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, "ప్రతి ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి, ఈ విషయాన్ని పెద్దదిగా చేయడం తగదు. ఇది నా రిక్వెస్ట్. నిన్న జరిగిన దాడిలో నాన్నకు గాయాలయ్యాయి. కుటుంబ గొడవల కారణంగా మా అమ్మ ఆసుపత్రి పాలైంది. గేట్లు పగలగొట్టుకుని మరీ మనోజ్ లోపలికి వచ్చాడు. ఓ తండ్రిగా మనోజ్‌పై నాన్న తక్కువగానే రియాక్ట్ అయ్యారు.
 
మమ్మల్ని అతిగా ప్రేమించడమే మా నాన్న చేసిన తప్పు. మేము కలిసి మెలిసి ఉంటాం అనుకున్నా. కానీ, దురదృష్టవశాత్తూ ఇలా జరిగింది. మేము మళ్లీ తిరిగి కలుస్తామని ఆశిస్తున్నా. నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్‌కు గాయాలయ్యాయి. అది దురదృష్టకరం. మీడియా వారికి ఆయన నమస్కరిస్తూ వచ్చారు. కానీ, అలా జరిగిపోయింది. గాయపడిన రిపోర్టర్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్నాం. ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిపై దాడి చేయలేదు.
 
మా కంటే ముందు మీడియాకు పోలీసుల నోటీసులు లీక్ అవుతున్నాయి. ఇవాళ ఉదయం 9.30 గంటలకు నాకు పోలీసుల నోటీసులు వచ్చాయి. పోలీసు విచారణకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు? కానీ, వ్యవస్థపై గౌరవం ఉంది కాబట్టి సీపీని కలుస్తాను. ప్రేమలో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పేది ఏమీ లేదు. 
 
కడుపు చించుకుంటే కాళ్లమీద పడుద్ది. నేను నా కుటుంబ విషయాలు మాట్లాడను. నేను ఇక్కడ ఉంటే, ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయంకృషితో గొప్ప స్థాయికి ఎదిగారు. మాకు లభించే గౌరవం ఆయనవల్లే. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించడం పిల్లలుగా మా బాధ్యత.
 
మీడియాలో కొంతమందే హద్దు మీరుతున్నారు. అందరూ కాదు. పబ్లిక్ ఫిగర్స్‌పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత. కానీ సోసైటీలో కొందరు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వినయ్ నాకు అన్నలాంటి వారు. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలేదు. వినయ్‌కు, నాకు 15 ఏళ్ల పరిచయం ఉంది. ఇండియాలోనే గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి.
 
తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీకి మంచి పేరు ఉంది. ఇండియాకు ఫారిన్ యూనివర్సిటీలను తీసుకువచ్చే ఘనత మాదే అవుతుంది. ఇప్పటికే ఆ వైపుగా చర్చలు జరుగుతున్నాయి. మోహన్ బాబుని నమ్మి అక్కడ తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. అది మాకు దేవాలయం. యూనివర్సిటీ జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఇక మా అక్కకు, నాకు భేదాభిప్రాయాలు ఉన్నా.. ఆమె కొట్టినా తిట్టినా నేను పడతాను. ఎందుకంటే తను నా అక్క.
 
మా కుటుంబంలో బయటి వ్యక్తుల ఇన్వాల్వెమెంట్ ఉంటే వారికి ఈ సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాము. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చేస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. నా సినిమా, మా అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలో మాట్లాడను. 
 
కానీ నాకు అవకాశం ఉంటే ఫిర్యాదులు, వాయిస్ మెసెజ్ కూడా బయటికి వచ్చేది కాదు. సమయమే అన్ని సమస్యలకు సమాధానం ఇస్తుంది. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఏడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమైనా ఉంటుందా? అని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Amrita Iyer : యాక్షన్ రోల్స్ చేయడం ఇష్టమే : అమృత అయ్యర్