Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

mohan babu staff : సిబ్బంది కొట్లాట మంచు మోహన్ బాబును రోడ్డు ఎక్కేలా చేసిందా?

Advertiesment
Majoj, mohanbabu

డీవీ

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (17:10 IST)
Majoj, mohanbabu
మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు శనివారంనాడే జరిగాయట. అది ఆదివారంనాడు బయట పడింది. అయితే అసలు గొడవంతా మోహన్ బాబు, మనోజ్ ల వ్యక్తిగత సిబ్బంది (పనివారి) గురించే వచ్చిందని శంషాబాద్ లోని మోహన్ బాబు ఇంటిలో పనిచేసే ఓ మహిళ తెలియజేసిన చిన్నవీడియో ఓ ఛానల్ బయటపెట్టింది. 
 
ఆమె చెప్పినమాటలను బట్టి, ఇటీవలే మనోజ్ కు బిడ్డపుట్టింది. దానికి సంబంధించిన ఫంక్షన్ ఇక్కడే చేశారు. మౌనిక, మోహన్ బాబు ఫ్యామిలీ కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. అయితే ప్రసాద్ అనే మోహన్ బాబు వ్యక్తిగత సెక్యూరిటీ ప్రవర్తన వల్ల అసలు గొడవ మొదలైంది. దాంతో నీ సెక్యూరిటీ నీది, నా సెక్యూరిటీ అనేరీతిలో మోహన్ బాబు మాట్లాడరట. ఆ తర్వాత మాటా మాటా పెరగడంతోపాటు గతంలో వున్న ఇష్యూస్ కూడా బయటపడడంతో ఒక్కసారి మనోజ్ తన తండ్రిపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే లక్మీప్రసన్న కూడా హుటాహుటిన వచ్చి మనోజ్ ను మందలించింది.. విష్ణు అన్నకు తండ్రి అంటే ప్రాణం. సార్ మీద చేయి వేసినా ఊరుకోడు. సార్ మీద చేయి వేశాడు మనోజ్ అందుకే ఇంత గొడవ జరిగింది అంటూ ఆమె తెలియజేసింది. ఇక ఇప్పుడు మంచు విష్ణు దుబాయ్ నుంచి వచ్చాడు. సమస్య సాల్వ్ చేయడానికే వచ్చాడు. చూద్దాం ఏం జరుగుతుందో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sohel lost money: సినిమా తీసి నష్టపోయా, నన్ను ట్రోలింగ్ కూడా చేశారు : సోహెల్