Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Sohel lost money: సినిమా తీసి నష్టపోయా, నన్ను ట్రోలింగ్ కూడా చేశారు : సోహెల్

Sohel

డీవీ

, మంగళవారం, 10 డిశెంబరు 2024 (16:40 IST)
Sohel
ఓ చిన్న చిత్రం బయటకు రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో నాకు తెలుసు. డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రారు. పేరు కోసం ఇక్కడకు వస్తారు. లక్ వస్తే.. డబ్బులు కూడా వస్తాయి. ఇంట్లో ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమాను తీశాను. నష్టపోయాను. నన్ను ట్రోలింగ్ కూడా చేశారు. హిట్టు కొట్టాలనే ఎవ్వరైనా సినిమాను చేస్తారు అని నటుడు సోహైల్ బాధను వ్యక్తం చేశారు. 
 
webdunia
Sadan, Priyanka Prasad, PL Vignesh, sohel, Raj Kandukuri
సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం 'ప్రణయ గోదారి'. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రణయగోదారి టీం అంతా కలిసి ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది.
 
 అనంతరం సోహెల్ మాట్లాడుతూ, ప్రణయ గోదారి లో అందరూ కొత్త వాళ్లే. వారి కష్టాన్ని గుర్తించి థియేటర్‌కు వెళ్లి సినిమాను చూడండి. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో చాలా నేచురల్‌గా చేశారు. కొత్త హీరో, దర్శక, నిర్మాతల్ని ఆడియెన్స్ ఎంకరేజ్ చేయాలి. డిసెంబర్ 13న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
 
దర్శక, నిర్మాత విఘ్నేశ్ మాట్లాడుతూ, నేను ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించాను. ఆస్తులన్నీ అమ్ముకున్నా. అప్పులు తెచ్చి మరీ సినిమాను తీశాను. నా అన్న మార్కండేయ కోసం ఈ మూవీని చేశాను. మా అన్న ఈ చిత్రానికి మంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ప్రసాద్ మంచి విజువల్స్ ఇచ్చారు. చాలా కష్టపడి చిత్రాన్ని అయితే తీశాను. కానీ రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాను. మళ్లీ అప్పు చేశాను. సినిమా తీయడం, రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వచ్చి మా సినిమాకు థియేటర్లు ఇస్తామని అన్నారు. మా సినిమా డిసెంబర్ 13న రాబోతోంది. అందరూ వచ్చి చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
 
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ, ప్రణయ గోదారి టైటిల్ నాకు చాలా నచ్చింది. చాలా పాజిటివ్‌గా అనిపించింది. సినిమాల్లో పెద్దది, చిన్నది అని ఉండదు. పెళ్లి చూపులు చిన్న బడ్జెట్‌లో చేశా. కానీ దాన్ని పెద్ద హిట్ చేశారు. అందుకే మంచి సినిమా, చెడ్డ సినిమా అని ఉంటంది. ప్రణయ గోదారి మంచి చిత్రం అవుతుంది. విఘ్నేశ్ చాలా మంచి వ్యక్తి. మార్కండేయ సంగీతం బాగుంది అని అన్నారు.
 
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో కొన్ని డాక్యుమెంటరీలు నేను కూడా తీశాను. ఈ మూవీ టైటిల్ నాకు చాలా నచ్చింది. ట్రైలర్, సాంగ్స్ నాకు బాగా నచ్చాయి. డిసెంబర్ 13న రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Soundarya House: సౌందర్య ఇంటి కోసమే.. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయా?