Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

Ashish

డీవీ

, బుధవారం, 22 మే 2024 (15:06 IST)
Ashish
రౌడీ బాయ్స్ సినిమా తర్వాత నిర్మాత  శిరీష్ కుమారుడు ఆశిష్ నటించిన సినిమా  ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా శనివారం విడుదలవుతుంది. దీనిపై హీరో ఆశిష్ తెలుపుతూ... ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ అదేరోజు క్రికెట్ సెమీ ఫైనల్స్ గనుక, నేను క్రికెట్ అభిమానిని గనుక ఇప్పటి ట్రెండ్ ను గౌరవిస్తూ,  మే 24 న విడుదల చేస్తున్నామని వివరించారు.
 
చిత్రం గురించి వివరిస్తూ.. ఇంతకుముందు రౌడీ బాయ్స్ సినిమా చేశాను. అధి యూత్ కు తగిన కథ. కానీ లవ్ మీ లో.. మెచ్చూరిటీ కథ చేశాను. ఇందులో దెయ్యంతో నేను ప్రేమ వ్యవహారం నడపమే ట్విస్ట్. చాలా ఆసక్తికరంగా వుంటుంది అన్నారు.
 
ఇక తనకు నటనలో అల్లు అర్జున్ స్పూర్తి. చిన్నతనంలోనే ఆయన ఫ్యాన్ ను. అలాగే ధనుష్, దుల్కర్ సల్మాన్ వీరిద్దరిపై ప్రత్యేక శైలి. వారినుంచి కూడా చాలా నేర్చుకున్నానని తెలిపారు.
 
కాగా, లవ్ మి సినిమా ఏప్రిల్ లో విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేశామని తెలిపారు. అయితే సినిమా రీష్యూట్ గురించి వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ... నిజమే. వారం రోజులు రీ ష్యూట్ చేశాం. దిల్ రాజు గారు కోరిక మేరకు కొన్ని సూచనలు చేశారు. అది సినిమాకు చాలా హెల్ప్ అవుతుందని తెలిపారు.
 
ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల