Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

Advertiesment
భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

సెల్వి

, బుధవారం, 15 మే 2024 (19:54 IST)
కేరళలో భర్తను వదిలి ప్రియుడితో భార్య పరార్ అయ్యింది. ఇన్ స్టా పరిచయం కుటుంబంలో చిచ్చు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. కేరళ, కోహికోడ్, తామరచ్చేరి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల మహిళకు గత ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. 
 
ఈ దంపతులకు నాలుగేళ్లలో ఓ చిన్నారి వుంది. అంతేగాకుండా ఆ మహిళ రెండు నెలల రెండు నెలల గర్భంతో వుంది. ఈ నేపథ్యంలో ఆమెకు వడకరైకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. 
 
ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ నేపథ్యంలో కారులో వచ్చిన ఆ యువకుడు ఈ నెల 10వ తేదీన ఆమెను ఎక్కించుకుని పారిపోయాడు. వీరిద్దరూ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తన భార్యను 10వ తేదీ నుంచి కనిపించట్లేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
విచారణలో ఆ గర్భిణి తన ప్రియుడితో కలిసి జీవించేందుకు సిద్ధంగా వున్నట్లు తెలపడంతో భర్త షాకయ్యాడు. భర్త, కన్నబిడ్డను వదిలి ప్రియుడితో వివాహిత పారిపోయిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత