హీరో అమిర్‌ఖాన్ నటిస్తున్న హిందీ చిత్రం `లాల్‌సింగ్ చద్దా. టాలీవుడ్ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. అమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫారెస్ట్‌గంప్ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ లడక్‌లో జరుగుతుంది. అయితే పేకప్ తర్వాత చిత్ర యూనిట్ టేబుల్ టెన్నిస్ ఆడుతూ సేద తీర్చుకుంటున్నారు.
ఆటలంటే ఇష్టమైన అమీర్ ఖాన్, నాగచైతన్య ఇద్దరూ టేబుల్ టెన్నిస్ ఆడుతూ కనిపించారు. అమీర్‌వైపు ఆయన కుమారుడు కూడా వున్నాడు. చిత్రయూనిట్‌కు చెందిన పిల్లలు కూడా ఇందులో పాల్గొన్నారని చాలా ఉషారుగా పాల్గొన్నారని నాగ చైతన్య పోస్ట్ చేశాడు. నాగచైతన్యకు ఇది తొలి బాలీవుడ్ మూవీ. తెలుగులో తన తండ్రితోపాటు బంగార్రాజు సినిమాలో నటిస్తున్నాడు. వచ్చేనెలలో ఆ షూటింగ్‌లో చైతు పాల్గొననున్నాడు.