Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డి కామెంట్స్ పైన స్పందించిన కొర‌టాల‌... అప్పుడెందుకు ఇప్పుడే...

గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తోన్న శ్రీరెడ్డి ఊహించ‌నివిధంగా బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివపై కూడా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే... శ్రీరెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన వారంద‌రూ స్పందించారు కానీ... కొర‌టాల స్పందించ‌ల

Advertiesment
శ్రీరెడ్డి కామెంట్స్ పైన స్పందించిన కొర‌టాల‌... అప్పుడెందుకు ఇప్పుడే...
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (16:30 IST)
గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తోన్న శ్రీరెడ్డి ఊహించ‌నివిధంగా బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివపై కూడా ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే... శ్రీరెడ్డి ఆరోప‌ణ‌లు చేసిన వారంద‌రూ స్పందించారు కానీ... కొర‌టాల స్పందించ‌లేదు. దీంతో కొర‌టాల తెర‌కెక్కించిన భ‌ర‌త్ అనే నేను ప్ర‌మోష‌న్ టైమ్‌లో స్పందించ‌క త‌ప్ప‌దు. అప్పుడు మీడియా ముందుకు వ‌చ్చిన‌ప్పుడు శ్రీరెడ్డి ఆరోప‌ణ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన ప‌రిస్థితి ఖ‌చ్చితంగా వ‌స్తుంది. ఇది గ‌మ‌నించి కొర‌టాల త‌న స్పంద‌న‌ను వీడియో రూపంలో మీడియాకి పంపించారు. 
 
ఇంత‌కీ ఈ వీడియోలో కొర‌టాల ఏం చెప్పారంటే....‘భరత్ అనే నేను’ ప్రమోషన్స్‌ను త్వరలోనే ప్రారంభించనున్నామని, అయితే, ఈ ప్రమోషన్స్ ప్రారంభించడానికి ముందే ఓ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలని నాకు అనిపిస్తోంది. గత వారంలో నా పేరిట కొన్ని స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో సర్క్యులేటయ్యాయి. 
 
అయితే, ‘భరత్ అనే నేను’తో ఫుల్ బిజీగా ఉన్న నేను హైదరాబాద్, ముంబై, చెన్నైలో తిరుగుతున్నాను. ఈ గ్యాప్‍లోనే విషయాలన్నీ తెలుస్తున్నాయి. కానీ, నాపై ఓ ఆరోపణ రావడంతో కొంచెం టెన్షన్ అయితే ఉంది. గాసిప్ లాంటిది, దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని నా శ్రేయోభిలాషులు చెప్పారు. కానీ, గతవారం నుంచి మీడియా, సోషల్ మీడియా వేదికగా చాలా చర్చలు జరుగుతున్నాయి.
 
కాబట్టి, దీనిపై నేను వివరణ ఇస్తున్నా. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి నా పేరు ప్రస్తావించ లేదు కానీ, ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి కనుక వివరణ ఇచ్చుకోవాలి. క్యాస్టింగ్ కౌచ్‌కు నేను వ్యక్తిగతంగా చాలా వ్యతిరేకిని. అలాంటి పనులకు నేను పూర్తిగా వ్యతిరేకం. నా చుట్టుపక్కల కూడా అలాంటివి ఎంకరేజ్ చేయను.. చాలా సీరియస్‌గా తీసుకుంటాను అన్నారు. 
 
‘ఇప్పటి వరకు నాలుగు సినిమాలకు దర్శకుడిగా పని చేశాను. చాలామంది నటులు, టెక్నీషియన్స్‌తో కలిసి పని చేశాను. వాళ్లతో చాలా గౌరవంగా ఉంటాం. ఆడవాళ్లు, మగవాళ్లని కాదు, మనిషి అనే భావనతో గౌరవంగా ఉంటాం. ‘అండి’ అని తప్ప, పేరు పెట్టి కూడా పిలవం. అలాంటిది నాపై ఆరోపణలు రావడంతో చాలా షాక్‌కు గురయ్యా. న్యాయం కోసం పోరాడుతున్న మహిళలకు నేనే కాదు ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాలి.
 
సినీ పరిశ్రమలో తప్పు జరిగితే మన ఇండస్ట్రీలో తప్పు జరిగిందనే బాధ కలుగుతుంది. నేను బయటే కాదు సెట్‌లోనూ అసభ్యకరమైన మాటలు మాట్లాడను. నా సినిమాలో మహిళలను కించపరిచే విధంగా ఏ ఒక్క సీన్ కూడా ఉండదు. అంటే, మహిళల పట్ల అంత గౌరవంగా ఉంటాను’ అని కొరటాల శివ చెప్పుకొచ్చారు. మ‌రి..కొర‌టాల స్పంద‌నపై శ్రీరెడ్డి ఎలా ప్ర‌తి స్పందిస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''శ్రీనివాస కల్యాణం'' విడుదలకు ముహూర్తం కుదిరింది..