Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యూ ట్యూబ్‌లో కిచ్చా సుదీప్ సంచ‌ల‌నం... ఇంత‌కీ ఏం చేసాడు..?

Advertiesment
యూ ట్యూబ్‌లో కిచ్చా సుదీప్ సంచ‌ల‌నం... ఇంత‌కీ ఏం చేసాడు..?
, శుక్రవారం, 23 ఆగస్టు 2019 (22:46 IST)
ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మన తెలుగులో ఈగ సినిమాలో విలన్‌గా అలానే, బాహుబలి మొదటి భాగంలో ఒక చిన్న సన్నివేశంలోనూ నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా కృష్ణ దర్శకత్వంలో కన్నడంతో తెరకెక్కుతున్న కొత్త సినిమాను తెలుగులో పహిల్వాన్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది వారాహి చలన చిత్రం నిర్మాణ సంస్థ. 
 
కన్నడ, తెలుగుతో పాటుగా, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కూడా డబ్బింగ్ చేయబడుతున్న ఈ సినిమాలో సుదీప్ సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా కబీర్ దుహాన్ సింగ్ విలన్‌గా, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఒక కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో సుదీప్ కుస్తీవీరుడు, బాక్సర్‌గా కనిపించనున్నారు. ఇందుకోసం ఆయన పలు కసరత్తులు కూడా నేర్చుకోవడం జరిగింది. స్వప్న పహిల్వాన్ నేతృత్వంలో ఈ మూవీ రూపొందుతోంది.
 
అర్జున్ జన్యా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసారు. ఇక ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ‘బలం ఉందన్న అహంతో కొట్టేవాడు రౌడీ, బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’… ‘మా కృష్ణ బరిలోకి దిగితే సింహం సార్ సింహం’ … ‘దేవుడు అందరికీ కలల్ని ఇస్తాడు, కానీ ఆకలే కలల్ని తినేస్తది’ వంటి డైలాగ్స్ ఆకట్టుకోగా …. ‘నేను గెలుస్తానో గెలవనో తెలియదుగాని, ఓటమిని మాత్రం సులభంగా ఒప్పుకోను’ అంటూ ట్రైలర్ చివరిలో సుదీప్ చెప్పే డైలాగ్ బాగుంది. 
 
ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, సీన్స్, ఫైట్స్ తో పాటుగా అలరించే బ్యాక్ గ్రౌడ్ మ్యూజిక్ తో రూపొందిన ఈ ట్రైలర్ ప్రస్తుతం మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆశ పడితే చాలదు.. దాన్ని పట్టుబట్టి సాధించాలి: 'కౌసల్యా కృష్ణమూర్తి' ఐశ్వర్యా రాజేష్‌