Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూకాంబికే దేవి ఆశీర్వాదం తీసుకున్న కేజీఎఫ్ 2 టీమ్‌

మూకాంబికే దేవి ఆశీర్వాదం తీసుకున్న కేజీఎఫ్ 2 టీమ్‌
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (16:32 IST)
KGF 2 team at Mookambika Devi Temple
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్2`. కేజీఎఫ్ మొదటి భాగం తో జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్ప‌రుచుకుంది. ఇక చాప్ట‌ర్ 2 విడుద‌ల‌కు క‌రోనా అడ్డంకిగా మారింది. ప్ర‌స్తుతం ప‌రిస్తితులు అనుకూలంగా వుండడంతో విడుద‌లతేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. క‌ర్నాట‌క‌లోని ఉడిపి జిల్లాలోని మూకాంబికే దేవి ఆల‌యాన్ని ద‌ర్శించుకుంది చిత్ర యూనిట్. అనంత‌రం చిత్ర విడుద‌ల తేదీని ఏప్రిల్ 14 వ తేదీగా ప్ర‌క‌టించింది. గ‌తంలోనూ ప్ర‌క‌టించినా అమ్మ‌వారి కృప వుండాల‌నీ ఎటువంటి అడ్డంకులురాకుండా వుండాల‌ని చిత్ర యూనిట్ కోరుకుంది. 
 
మంగ‌ళ‌వారం అమామాస్య‌రోజు ప్ర‌త్యేక దినం కావ‌డంతో హీరో య‌శ్‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌లు క‌లిసి దేవాల‌య సంద‌ర్శం చేసుకున్నారు. కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో ఉన్న కొల్లూరు "శ్రీ క్షంత్రం" పరశురాముని సృష్టిలో మోక్షానికి సంబంధించిన ఏడు నివాసాలలో ఒకటి. శ్రీ క్షేత్రం ఆదిశంకరాచార్యులచే స్థాపించబడింది. ఇది శక్తి దేవిని పూజించే నివాసం. ఇక్కడ మూకాంబికే దేవిని శక్తి దేవతగా పూజిస్తారు. మూక అని పిలువబడే రాక్షసుడు ఈ క్షేత్రంలో చంపబడ్డాడు. లింగం ఎడమ వైపున "మహాకాళి", మహా లక్ష్మి, మహా సరస్వతి" కలిసి ఉన్నందున మూకాంబికే ఒక ఆది శక్తి. ఈ రూపంలో ఉన్న ఆదిశక్తి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఉద్భవలింగ రూపంలో, మూకాంబికే కుడి వైపున బ్రహ్మ, విష్ణు, శివుడిని కూడా ఏకీకృతం చేసింది.
అలాగే కర్ణాటక కుమ్భాషిలో అనేగుద్దె శ్రీ వినాయక దేవస్థానం కూడా సంద‌ర్శించి వినాయ‌కుని ఆశీస్సులు పొందారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

42 సంవత్సరాల నాటి అపురూప క‌ల‌యిక‌