Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలకృష్ణ అలా మాట్లాడటం చాలా పెద్ద తప్పు: సి. కళ్యాణ్

Advertiesment
బాలకృష్ణ అలా మాట్లాడటం చాలా పెద్ద తప్పు: సి. కళ్యాణ్
, శుక్రవారం, 29 మే 2020 (15:44 IST)
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి టాలీవుడ్‌కు చెందిన కొందరు భూములు పంచుకుంటున్నారా? అంటూ సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సిసిసి తరపున సినీ కార్మికులకు రెండో విడత సాయంపై చర్చించేందుకు కొందరు ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశమయ్యారు. 
 
ఈ సమావేశం తర్వాత నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, టాలీవుడ్ ఇండస్ట్రీని లీడ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా చిరంజీవి, నాగార్జునను కోరారని చెప్పారు. అలాగే, చిరంజీవి నివాసంలో సమావేశమవుదామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారని, ఆ ప్రకారంగానే సమావేశమైనట్టు తెలిపారు. 
 
అయితే, భూములు పంచుకోవడానికే మంత్రి తలసానితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారా? అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడం పెద్ద తప్పు అని అన్నారు. సినిమా సమస్యల పరిష్కారం కోసం టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయితే, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమావేశమయ్యారా? అంటూ బాలయ్య మాట్లాడాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. 
 
ఇకపోతే, సినీ నటులు బాలకృష్ణ, నాగబాబుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో తాము తలదూర్చబోమని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించే అంశంపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు తాము సీఎం కేసీఆర్‌తో సమావేశం కావడం జరిగిందన్నారు. 
 
బాలకృష్ణ మనసులో ఏదో పెట్టుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమావేశమయ్యారా? అనే వ్యాఖ్యలు చేసివుంటారన్నారు. ఈ వ్యాఖ్యలను నాగబాబు తీవ్రంగా ఖండించారని తమ్మారెడ్డి గుర్తుచేశారు. కానీ, వీరిద్దరి వ్యవహారంలో తాము తలదూర్చబోమన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు ఇంట్లో కీలక భేటీ - బాలయ్య ఏమన్నారు.. నాగబాబు కౌంటరేంటి?