Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

నా వైపు తప్పు ఉంది.. అందుకే నోరు మూసుకుని కూర్చొన్నా : కనికా కపూర్

Advertiesment
Kanika Kapoor
, సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:48 IST)
బాలీవుడ్ గాయని కనికా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడిన తొలి సినీ సెలెబ్రిటీ. లండన్‌కు వెళ్లివచ్చిన కారణంగా ఈమెకు కరోనా సోకింది. ఈమె ఇపుడు కోలుకుంది. అయినప్పటికీ హోం క్వారంటైన్‌లో ఉంది. దీనిపై ఆమె స్పందిస్తూ, తన వైపు తప్పువుండటం వల్లే తాను ఇంతకాలం నోరు మూసుకుని కూర్చొన్నట్టు చెప్పుకొచ్చింది. 
 
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించిన నేపథ్యంలో మార్చి 10వ తేదీన ఈ అమ్మడు లండన్ నుంచి ముంబైకు వచ్చింది. ఆమెకు విమానాశ్రయంలో పరీక్షలు నిర్వహించారు. అక్కడ ఏమీ తెలియలేదు. పైగా, హోం క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన లేకపోవడంతో ఆమెను వదిలివేశారు. 
 
ఆ తర్వాత 11వ తేదీన తన బంధువులను కలిసేందుకు లక్నోకు వెళ్లింది. మార్చి 18వ తేదీన క్వారంటైన్ నిబంధనలను కేంద్రం జారీచేసింది. ఈలోగా కనికా కపూర్ పలు పార్టీలకు వెళ్లింది. మార్చి 17, 18 తేదీల్లో ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా, పాజిటివ్ వచ్చింది. యూపీ పోలీసులు ఆమె నిబంధనలను అతిక్రమించిందని కేసు కూడా రిజిస్టర్ చేశారు. 
 
అయితే, లండన్‌ నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత కనికా కపూర్ లాక్‌డౌన్ నిబంధనలను పాటించకుండా ముంబై, లక్నో ప్రాంతాల్లో పలువురిని కలవడం, పలు పార్టీలకు హాజరుకావడం, ఈ పార్టీలకు పలువురు సెలబ్రిటీలు రావడం, ఆపై కనికాకు కరోనా సోకినట్టు నిర్దారణ కావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 
 
తాజాగా ఆమె కరోనా నుంచి కోలుకుని లక్నోలోని తన కుటుంబ సభ్యులతో క్వారంటైన్‌ను కొనసాగిస్తూ, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. 'యూకే, ముంబై, లక్నోల్లో నేను కలిసిన వ్యక్తుల్లో ఎవరికీ కరోనా లక్షణాలు కనిపించలేదు. నాకు కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత వారికి పరీక్షలు చేయిస్తే నెగిటివ్ అని తేలింది. కరోనా వైరస్ గురించి తెలిసి కూడా నేను కొంత తప్పు చేశాను కాబట్టే, ఇన్నాళ్లూ నోరు మెదపకుండా ఉన్నాను. నన్ను దోషిగా చూపిస్తూ అనేక కథనాలు, ప్రచారం చేశారు. వాటికి కాలమే సమాధానం చెబుతుంది' అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, 'తన వైపు కొంత తప్పు ఉండబట్టే, ఇంతకాలమూ వచ్చిన కథలు, రూమర్లపై స్పందించదలచుకోలేదని చెప్పుకొచ్చిన ఆమె, ఏదో రోజు అసలు విషయం బయటకు వస్తుందనే భావించానని, తనపై అసత్యాలు ప్రచారం చేసిన వాళ్లు పశ్చాత్తాపపడి తీరుతారు' అని పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్న కంటే చెల్లినే అత్యంత కిరాతకురాలు : వర్మ ట్వీట్