Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఫైర్ల పేరుతో ఆ స్టార్ హీరో బెదిరించాడు.. కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తెర‌పైనే కాదు నిజ జీవితంలోనూ చాలా బోల్డ్‌గా మాట్లాడుతుంది. కనిపిస్తుంది కూడా. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెపుతుంది.

Advertiesment
అఫైర్ల పేరుతో ఆ స్టార్ హీరో బెదిరించాడు.. కంగనా రనౌత్
, ఆదివారం, 10 డిశెంబరు 2017 (13:41 IST)
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. తెర‌పైనే కాదు నిజ జీవితంలోనూ చాలా బోల్డ్‌గా మాట్లాడుతుంది. కనిపిస్తుంది కూడా. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెపుతుంది. 
 
అందుకే కంగనా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈమె తాజాగా మ‌రో బాంబ్ పేల్చింది. బాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొత్త‌లో త‌న‌ను ఓ స్టార్ హీరో బెదిరించాడ‌ని వెల్ల‌డించింది.
 
అఫైర్ల పేరుతోను, ఇత‌ర వివాదాల పేరుతోనూ త‌న‌ను బెదిరించి ఇండ‌స్ట్రీ నుంచి బ‌య‌ట‌కు పంపాల‌ని చాలామంది కుట్ర ప‌న్నార‌ని, వారిలో ఓ స్టార్ హీరో కూడా ఉన్నార‌ని చెప్పింది. అవ‌న్నీ త‌ట్టుకుని ధైర్యంగా నిల‌బ‌డి ఈ స్థాయికి వ‌చ్చాన‌ని పేర్కొంది. 
 
అయితే అప్ప‌ట్లో త‌న‌ను బెదిరించిన‌ ఆ స్టార్ హీరో పేరు మాత్రం చెప్ప‌నంది. ఆ హీరో పేరు చెప్ప‌డానికి త‌నేమీ భ‌య‌ప‌డ‌న‌ని, అయితే అది చాలా రోజుల కింద‌టి విష‌యం కాబ‌ట్టి ఇప్పుడు చెప్పినా ఉప‌యోగం లేద‌ని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తతో పిల్లల గురించి ప్లానింగ్ చేస్తున్నా : నటి అనిత