Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూజాభట్‌కు కంగనాల మధ్య మాటల యుద్ధం... అంతా నెపోటిజం పుణ్యమే

Advertiesment
పూజాభట్‌కు కంగనాల మధ్య మాటల యుద్ధం... అంతా నెపోటిజం పుణ్యమే
, గురువారం, 9 జులై 2020 (20:29 IST)
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్‌లో మొదలైన నెపోటిజం గొడవ కొనసాగుతూనే వుంది. నెపోటిజం గురించి బయటకి వచ్చి బహిరంగంగానే స్టార్స్‌ కిడ్స్‌ని, మహేష్‌ భట్‌, కరన్‌జోహార్‌ లాంటి నిర్మాతలను విమర్శించిన వారిలో కంగనా రనౌత్‌ ముందజంలో ఉన్నారు. ఇక నెపోటిజానికి సంబంధించి సోషల్‌మీడియా వేదికగా మహేష్‌ కుమార్తె పూజా భట్‌కు, కంగనా రనౌత్‌కు మాటల యుద్దం నడుస్తూనే వుంది. 
 
2006 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు కార్యక్రమంలో గ్యాంగ్‌స్టర్‌ సినిమాలో నటించినందుకు గాను కంగనా బెస్ట్‌ డెబ్యూట్‌ యాక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కంగనా మహేష్‌ భట్‌కు ధన్యవాదాలు తెలిపింది. తాజాగా పూజాభట్‌ ఈ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలు అబద్ధమా అంటూ ప్రశ్నించింది. తన కుటుంబం మీద వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. 
 
విశేష్ ఫిల్మ్ ఒకప్పుడు కొత్తవారితో మాత్రమే పనిచేసినందుకు అపఖ్యాతి పాలైందని పూజ గుర్తుచేశారు. ఇక దీనిపై స్పందించిన కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియా టీం మహేష్‌ భట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ నటుల కోసం అంత ఎక్కువగా డబ్బు ఖర్చు చేయదని పేర్కొంది. కంగనా లాంటి టాలెంట్‌ ఉన్న వారు తక్కువ డబ్బులకు చేయడానికి దొరకడంతో మహేష్‌ భట్‌ ఆమెకు అవకాశం ఇచ్చారని మండిపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా అస్సలు పేరు అది కాదు.. ఆయన మార్చారు : రేణూ దేశాయ్