Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

కంగనాకు కౌంటరిచ్చిన తాప్సీ - కొందరు మంచిలో కూడా చెడు చూస్తారంటూ...

Advertiesment
Taapsee Pannu
, సోమవారం, 6 జులై 2020 (18:27 IST)
బాలీవుడ్ నటీమణులు కంగనా రనౌత్, తాప్సీ పన్నుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా, సినీ ఇండస్ట్రీలో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చకు తెరలేసింది. ఈ క్రమంలోనే కంగనా రనౌత్, తాప్సీల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. 
 
ఇటీవల తాప్సీ చేసిన వ్యాఖ్యలపై కంగన డిజిటల్ టీమ్ స్పందిస్తూ... సినీ నేపథ్యం లేకుండా వచ్చినవారు కూడా మూవీ మాఫియా దృష్టిలో మంచిగా ఉండాలనుకుంటున్నారని వ్యాఖ్యానించింది. తాప్సీ నిన్ను చూసి సిగ్గుపడుతున్నామని పోస్ట్ చేసింది.
 
ఈ వ్యాఖ్యలపై తాప్సీ స్పందిస్తూ... కొందరు వ్యక్తులు మంచిలో కూడా చెడును చూస్తారని వ్యాఖ్యానించింది. అలాంటి వారి పట్ల కూడా మనం మంచిగానే ఉండాలని... వారి గురించి ప్రార్థనలు చేద్దామని చెప్పింది. మన ప్రవర్తన ఎలా ఉండకూడదో వారిని చూసి తెలుసుకోవాలని తెలిపింది.
 
మరోవైపు, సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణ వేగం పుంజుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా, ముంబై పోలీసులు పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారిస్తున్నారు. ఇందులోభాగంగా, తాజాగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా భన్సాలీ తన వాంగ్మూలాన్ని ఇచ్చారు.
 
సుశాంత్ సింగ్‌కు సినిమా ఆఫర్లను ఇచ్చాను... కానీ, డేట్స్ సమస్య వల్ల ఇద్దరం కలిసి పని చేయలేకపోయామని పోలీసులకు భన్సాలీ తెలిపారు. మరోవైపు సుశాంత్ చనిపోయిన తర్వాత భన్సాలీ ఎంతో ఆవేదనకు గురయ్యారు. నీవెంత బాధ పడ్డావో తనకు తెలుసని సుశాంత్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. నిన్ను అణచివేసిన వ్యక్తుల గురించి తనకు తెలుసని అన్నారు. నీ బాధను చెప్పుకుంటూ నా భుజంపై తల పెట్టి ఏడ్చిన ఘటనను మర్చిపోలేనని చెప్పారు. ఇదంతా వాళ్ల కర్మ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుశాంత్ సింగ్ చివరి సినిమా ట్రైలర్.. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫ్యాన్స్ (Video)