ఎన్టీఆర్ బయోపిక్.. జయలలిత రోల్‌లో నేనా? నోనో: కాజల్ అగర్వాల్
తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవల హైదరబాద్‌లో రామకృష్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్
తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవల హైదరబాద్‌లో రామకృష్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్‌కు క్లాప్ కొట్టారు.
దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం రామకృష్ణ స్టూడియోస్‌లో వేసిన కౌరవ సభ సెట్‌లో తొలి చిత్రీకరణ జరిగింది. కౌరవ సెట్‌లో బాలకృష్ణ ఎన్టీఆర్ రోల్‌లో దుర్యోధనుడిగా అలరించారు.
ఈ చిత్రంలో చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కాజల్ చేతిలో ''క్వీన్'' రీమేక్ (పారిస్ పారిస్)మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో జయలలిత పాత్రలో కాజల్ కనిపించబోతుందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.
ఈ వార్తల్లో నిజం లేదని.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని కాజల్ స్పష్టం చేసింది. కాగా ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా.. దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది.