అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. 'దఢక్' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో పరిమిత మోతాదులోనే గ్లామర్‌గా నటించింది. నిజానికి ఈమెకు గ్లామర్ షో అంటే చెవికోసుకుంటుంది. దీంతో ఫోటో షూట్‌లు, మూవీ ఫంక్షన్లు, ఫ్యామిలీ పార్టీల్లో మాత్రం పొదుపుగా బట్టలేసి అందాల ఆరబోతతో సెగలు పుట్టిస్తుంటుంది.
తన తొలి చిత్రం తర్వాత హాట్ హాట్ ఫోటో షూట్‌లతో తనలోని గ్లామర్ కోణాలను బయటపెట్టిన ఈ బ్యూటీ తాజాగా వోగ్ ఉమెన్ అవార్డ్స్ ఫంక్షన్‌లో బంగారు వర్ణపు లాంగ్ ఫ్రాక్‌లో అందాలు ఆరబోస్తూ వీక్షకులు మతులు పోగొట్టింది.
లేలేత అందాలతో కనువిందు చేస్తూ కెమెరా కంటికి కునుకు లేకుండా చేసింది. అయితే ఈ డ్రెస్‌లో అమ్మడు చాలా ఇబ్బంది పడింది. పదే పదే డ్రెస్‌ను సవరించుకుంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం జాన్వీ హాట్ లుక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.