Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవితా రాజశేఖర్‌ను ఇరుకున బెడుతున్న నరేష్

Advertiesment
జీవితా రాజశేఖర్‌ను ఇరుకున బెడుతున్న నరేష్
, శనివారం, 3 జులై 2021 (19:52 IST)
ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో మొత్తం టాపిక్ మా ఎన్నికలపైనే. ఎప్పుడూ లేని విధంగా నలుగురు అధ్యక్ష పదవులకు పోటీ పడడం..వారికి కొంతమంది ముఖ్య నటులు సపోర్ట్ చేయడం జరుగుతున్నాయి. ఒక్కో ప్యానల్‌కు ఒక్కొక్కరు సపోర్ట్ చేయడమే ఇప్పుడు అసలు సమస్యగా మారుతోంది.
 
ప్రకాష్‌ రాజ్‌కు మెగాస్టార్ కుటుంబం పూర్తిగా సహకరించడం.. ఇక మంచు విష్ణుకు బాలక్రిష్ణ, క్రిష్ణ కుటుంబం, జీవితా రాజశేఖర్‌కు నరేష్ తదితర హీరోలు సహకరిస్తుండడం జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించారు కానీ మిగిలిన వారు తమ ప్యానల్ సభ్యులను ప్రకటించలేదు.
 
అనూహ్యంగా తెరపైకి జీవితా రాజశేఖర్ వచ్చినా ఆమెకు ఎవరు సపోర్ట్ చేస్తారన్నదే ఆసక్తిగా మారింది. చివరకు నరేష్ లాంటి సీనియర్ హీరోలు సపోర్ట్ చేస్తామని చెప్పారు. వారి తరపున మాట్లాడుతున్నారు. అయితే అప్పుడెప్పుడో మా అసోసియేషన్లో సభ్యులకు తను చేసిన సహాయాన్ని గుర్తు చేస్తున్నారు నరేష్.
 
ఇదే ఇప్పుడు అసలు సమస్యకు కారణమవుతోంది. మెగా కుటుంబంలో సినీకళాకారులకు ఎంతగానో సహాయం చేశారు. అలాంటిది వారే చెప్పుకోవడం లేదు.. జీవితా రాజశేఖర్ తరపున సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న నరేష్ ఇదే విషయాన్ని పదేపదే చెప్పడం మాత్రం సభ్యులకు ఏ మాత్రం ఇష్టం లేదట.
 
జరిగి పోయినదానికన్నా జరగబోయే దాని గురించి మాట్లాడితే బాగుంటుందన్న అభిప్రాయం సినీకళాకారుల నుంచి వ్యక్తమవుతోందట. జీవితా రాజశేఖర్ కూడా అదే నరేష్ కు చెప్పాలనుకుంటున్నారట. కానీ సీనియర్ నటుడు కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారో తెలియక జీవితా సైలెంట్ గా ఉండిపోతున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జానీ మాస్టర్ బర్త్ డే.. దళపతిని హత్తుకున్న ఫోటోలు వైరల్ అండ్ ట్రెండ్