Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Advertiesment
Harish Shankar, Allari Naresh, Kamakshi Bhaskarla

దేవీ

, మంగళవారం, 18 నవంబరు 2025 (16:24 IST)
Harish Shankar, Allari Naresh, Kamakshi Bhaskarla
హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమేర మూవీ సిరీస్‌ తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు. నవంబర్‌ 21న ఈ సినిమా విడుదల కానుంది. 
 
ఈ సందర్భంగా  అల్లరి నరేష్ మాట్లాడుతూ.. 64 సినిమాలు చేశాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే టాక్ ఏంటి, ఓపెనింగ్స్ ఏమిటి ? ఎలాంటి రివ్యూస్ వస్తాయనే టెన్షన్ గా ఉంటుంది. కానీ నాని ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. తనకి ఎక్కడ టెన్షన్ లేదు. ఇంత కాన్ఫిడెన్స్ గా ఉండడానికి కారణం మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉంది. నాంది సినిమా చేస్తున్నప్పుడు విజయ్ ఎలా చేస్తాడో అని కన్సర్న్ తో  ఉండేవారు హరీష్ గారు. అలాంటి గురువు ఎవరికైనా ఉండాలి. అనిల్ గారు కూడా నాని ఈ సినిమా చేస్తున్నప్పుడు అంతే కేర్ తీసుకున్నారు. ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వారిని ఎవరు ఆపలేరు. 
 
నేను 35 మంది కొత్త డైరెక్టర్స్ తో పని చేశాను.  దాంట్లో చాలా మంది సక్సెస్ అయ్యారు. కొంతమంది అవ్వలేదు. ఒక డైరెక్టర్ గారి అబ్బాయిగా నేను వాళ్ళ అందరితో ఎప్పుడూ ఉంటాను. నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ గా ఉండాలనుకుంటున్నాను. గెటప్ శ్రీను హర్ష జీవన్ ఎక్కడ విసుక్కోకుండా చాలా ఓపికతో ఈ సినిమా చేశారు. రమేష్ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇలాంటి సినిమాలకి విజువల్స్ బ్యాగ్రౌండ్ స్కోర్స్ సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉండాలి. ఈ మూడింటిలో మేము సక్సెస్ అయ్యాం. 
 
భీమ్స్ గారికి నాకు ఇది చాలెంజింగ్ ఫిలిం. ఇలాంటి జానర్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. నువ్వా నేనా  సమయంలో బీమ్స్ లో ఎంత కసి ఉందో ఇప్పుడు అంతే ఉంది.  తను చాలా బిజీగా ఉండడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత నా గురించి కంటే భీమ్స్ గురించి ఎక్కువ రాస్తారు. కామాక్షి, అనిల్ ప్రొఫెషనల్ గా డాక్టర్స్.  పొలిమేర లాంటి సినిమా చేసి తమను తాము ప్రూవ్ చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి ఒక ప్యాషన్ తో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకి పనిచేసిన అందరూ కూడా సిన్సియర్ గా కష్టపడ్డారు. 
 
నా సామి రంగ చేసినప్పుడు నా కాలికి దెబ్బ తగిలింది. చిట్టూరి గారు సెంటిమెంట్ అన్నారు. నిజంగా సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా చేసినప్పుడు కూడా నా భుజానికి గాయమైంది.తప్పకుండా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా ఈ సినిమాని తీశారు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్