Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హెబ్బా పటేల్ లుక్ ఇలా మారిందేమిటి?

Advertiesment
హెబ్బా పటేల్ లుక్ ఇలా మారిందేమిటి?
, శనివారం, 14 నవంబరు 2020 (12:30 IST)
Hebah Patel
హెబ్బా పటేల్ అంటేనే గ్లామర్. అందాల ఆరబోతకు ఆమె పెట్టింది పేరు. అలాంటి అమ్మాయి ఒక్కసారిగా కొత్త అవతారం ఎత్తింది. మిడిల్ క్లాస్ రోల్‌లో సాదాసీదాగా కనిపించింది. ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ హీరోయిన్ డీ-గ్లామరస్ రోల్‌లో కనిపించడంపై ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే? తాజాగా ఓదెల రైల్వేస్టేషన్ చిత్రం నుండి హెబ్బా పటేల్ లుక్ విడుదల చేశారు. ఇందులో రాధ అనే పాత్రలో హెబ్బా నటిస్తుండగా, ఆమె లుక్ అభిమానులని ఆకట్టుకుంటుంది.
 
కన్నడ నటుడు వశిష్ట సింహా తెలుగులో నటించిన ఓదెల రైల్వేస్టేషన్ చిత్రంలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో హెబ్బా పటేల్‌ నటిస్తున్నారు . శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్‌లో 'బెంగాల్‌ టైగర్‌' చిత్రానికి దర్శకత్వం వహించిన సంపత్‌ నంది ఈ సినిమాకి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అశోక్‌తేజ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
 
ఓదెల గ్రామంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం మేకప్, డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్, డ్రీమ్‌ సీక్వెన్సెస్, పాటలు లేకుండా సహజత్వానికి దగ్గరగా తెరకెక్కుతుంది. సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినీ ఇండస్ట్రీకి ఏమైంది..? ప్రేమ విఫలం.. జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య