Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హ్యాపీ బర్త్ డే ఫైటర్ (విజయ్ దేవరకొండ), సామాజిక సేవలో సైతం...

Advertiesment
హ్యాపీ బర్త్ డే ఫైటర్ (విజయ్ దేవరకొండ), సామాజిక సేవలో సైతం...
, శనివారం, 9 మే 2020 (13:30 IST)
ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నానితో కలిసి ఓ ముఖ్య పాత్ర పోషించి.. ఆ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన యంగ్ టాలెండెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో ఎవరీ... విజయ్ దేవరకొండ అని ఆరా తీయడం స్టార్ట్ చేసారు. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాతో కమర్షియల్‌గా సక్సస్ సాధించి తనకంటూ ఓ గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. 
 
పెళ్లిచూపులు తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. 
 
బాక్సాఫీస్ వద్ద అర్జున్ రెడ్డి ఓ సంచలనం. ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండడంతో... అర్జున్ రెడ్డి చిత్రం యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. అంతే.. ఈ ఒక్క సినిమాతో విజయ్ బాగా పాపులర్ అయ్యాడు. 
 
దర్శకులు, నిర్మాతలు విజయ్‌తో సినిమా చేయడానికి క్యూ కట్టారు. ఆ తర్వాత పరశురామ్ డైరెక్షన్లో రూపొందిన గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. తెలుగులోనే కాకుండా.. విజయ్ నటించిన డియర్ కామ్రేట్ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేసారు. 
 
ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫైటర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ చిత్రాన్నిపూరి - ఛార్మి - కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇలా.. విజయ్ అనతి కాలంలోనే సెన్సేషన్ క్రియేట్ చేసాడు. 
 
ఇదంతా ఓ ఎత్తైతే... విజయ్ దేవరకొండ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు. కరోనా వలన కష్టాల్లో ఉన్న వాళ్లకు ఈ ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్నాడు.

ఇటీవల ఫేక్ న్యూస్ పైన యుద్ధం ప్రకటించాడు. విజయ్ ఇచ్చిన పిలుపుకు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున సైతం మద్దతు తెలియచేసారంటే... విజయ్ మంచితనంతో ఎంత పేరు సంపాదించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విజయ్‌కి టాలీవుడ్ ప్రముఖులు పుట్టినరోజు శభాకాంక్షలు తెలియచేస్తున్నారు. విజయ్ మరిన్ని విజయాలు సాధించాలని.. కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు విజయ్ దేవరకొండ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాయిపల్లవి ఎదురుచూపులు ఎవరి కోసం..?