Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయ్ దేవరకొండకు మహేష్ బాబు మద్దతు.. సోదరా నీకు నేనున్నా..

విజయ్ దేవరకొండకు మహేష్ బాబు మద్దతు.. సోదరా నీకు నేనున్నా..
, సోమవారం, 4 మే 2020 (23:22 IST)
గీత గోవిందం హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఓ నాలుగు వెబ్ సైట్లు తన సినీ కెరీర్‌ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ విజయ్ దేవరకొండ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. ఇంకా విజయ్‌కి సంఘీభావం ప్రకటించారు. 
 
''నీకు నేను అండగా ఉంటాను సోదరా" అంటూ విజయ్ దేవరకొండకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు ఆవేశపూరిత వ్యాఖ్యలతో కూడిన సందేశాన్ని కూడా వెలువరించారు. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమకు తర్వాత సంపాదించుకునే గౌరవాన్ని.. ఎవడో ముక్కూమొహం తెలియనివాడు, డబ్బుకోసం ఏమైనా చేసేవాడు వచ్చి మమ్మల్ని అగౌరవపరుస్తూ, పాఠకులకు అవాస్తవాలు నూరిపోస్తూ, దుష్ప్రచారం సాగిస్తుంటాడు. ఇదంతా కూడా డబ్బు కోసమే.
 
ఇలాంటివాళ్ల బారి నుంచి తెలుగు సినిమాకు చెందిన ఈ అందమైన పరిశ్రమను కాపాడుకోవాలనుకుంటున్నాను. నా అభిమానులను, నా పిల్లలను ఇలాంటి దురాలోచనలతో కూడిన ప్రపంచం నుంచి రక్షించుకోవాలనుకుంటున్నాను. మాపై ఆధారపడి, మా జీవితాలనే కించపరిచేలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న ఇలాంటి ఫేక్ వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని చిత్ర పరిశ్రమను కోరుతున్నాను" అంటూ మహేశ్ బాబు తన లేఖలో ఆగ్రహావేశాలు ప్రదర్శించారు. ఫేక్‌న్యూస్‌ను నిర్మూలించండి, గాసిప్ వెబ్‌సైట్లను అంతమొందించండి అంటూ పిలుపునిచ్చారు.
 
అంతకుముందు సినీ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వెబ్ సైట్లు... తప్పుడు వార్తలు రాస్తూ, వాటిని అమ్ముతూ, డబ్బు చేసుకుంటున్నాయని విజయ్ దేవరకొండ మండిపడ్డాడు. గత నెల రోజులుగా నాలుగు వెబ్ సైట్లు తనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాయని, తనపై విపరీతంగా తప్పుడు వార్తలను రాస్తున్నాయని చెప్పాడు.
 
విజయ్ దేవరకొండ ఎక్కడ? ఎక్కడ దాక్కున్నాడు? అంటూ రాస్తున్నాయని అన్నాడు. ఇంటర్వ్యూలు ఇవ్వకపోతే తప్పుడు వార్తలు రాస్తామని, ప్రకటనలు ఇవ్వకపోతే రేటింగ్స్ తగ్గిస్తామని బెదిరిస్తారని చెప్పాడు. విరాళాలు అడిగేందుకు వీళ్లెవరని మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చూడండి మద్యం షాపుల వద్ద ఎవరు క్యూలో ఉన్నారో...? ఆర్జీవీ