Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల

Advertiesment
Greenindia Challenge: Megastar Chiranjeevi's daughter Sushmitha Konidela planted sapling
, మంగళవారం, 21 జులై 2020 (15:24 IST)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకు ఉద్యమంలా ముందుకు కొనసాగుతోంది. ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడానికి ప్రముఖులు, సెలబ్రిటీస్ ఉత్సాహం చూపుతున్నారు. ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ శిల్పా రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుస్మితా కొణిదెల తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి ఈరోజు జూబ్లీహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణంలో మూడు మొక్కలు నాటడం జరిగింది.
 
ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ ఈరోజు  మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టి మాకు ఇష్టమైన పని అయిన మొక్కలు నాటడంను మాతో చేయించినందుకు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనా వైరస్ ప్రభావం వల్ల లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి పని చేశాము అంటే ఈరోజు ఈ మొక్కలు నాటడమే. నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.
 
ఇదేవిధంగా ఈ యొక్క ఛాలెంజ్‌ను ఇంకా పెద్ద ఎత్తున అందరు ముందుకు తీసుకోనిపోయి బాధ్యతగా మొక్కలు నాటాలని వాటిని రక్షిస్తే మనకు ఆక్సిజన్, నీడను ఇస్తాయి అని తెలిపారు. ఈ సందర్భంగా మరో ముగ్గురిని ఈ చాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నానని. మా చెల్లెలు శ్రీజ, మా కుటుంబ సభ్యురాలు అల్లు స్నేహ రెడ్డి, స్వప్న దత్‌లను మొక్కలు నాటాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజుకు తక్కువ.. రాణికి ఎక్కువ? దీపికకు అంత అవసరమా?