Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

Advertiesment
chiranjeevi

ఠాగూర్

, మంగళవారం, 18 మార్చి 2025 (09:56 IST)
బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన జీవిత సాఫల్య పురస్కారం అందుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి లండన్ చేరుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో చేస్తున్న సేవలను, వ్యక్తిగతంగా ఆయన చేసిన దాతృత్వానికి, ఆదర్శప్రాయమైన ఆయన కృషిని గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో చిరంజీవిని సత్కరించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా 19వ తేదీ జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం చేయనుంది. ఈ నేపథ్యంలో పురస్కారాన్ని అందుకునేందుకు లండన్ బయలుదేరిన మెగాస్టార్ హిత్రూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అభిమానులు అక్కడాయనకు ఘన స్వాగతం పలికారు. 
 
బంధించడానికి వెళ్లిన వారిపై దాడి చేసిన పులి.. చంపేసిన అధికారులు.. 
 
తనను బంధించేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులపై ఓ పులి దాడి చేసేందుకు యత్నించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆత్మరక్షణ కోసం వారిపై దాడి చేసింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా వండి పెరియార్ అనే గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఇటీవల అటవీ ప్రాంతం నుంచి ఓ పులి జనావాస ప్రాంతాల్లోకి వచ్చినట్టు అటవీ శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో దాన్ని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అది ఓ తేయాకు తోటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దానికి మత్తు మందు ఇవ్వడానికి 15 మిటర్ల దూరం నుంచి మొదట కాల్పులు జరిపారు. 
 
దీంతో అది ఒక్కసారిగా వారిపై దాడి చేసేందుకు పైకి దూకింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ఆత్మరక్షణ కోసం సిబ్బంది వెంటనే మళ్లీ కాల్పులు జరపడంతో అది మృతి చెందినట్టు అటవీశాఖ సీనియర్ అధికారులు వెల్లడించారు. మృతి చెందిన పులి వయసు పదేళ్ళు ఉంటుందని అధికారులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్