Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

Advertiesment
cow2

ఠాగూర్

, సోమవారం, 17 మార్చి 2025 (20:09 IST)
గోమాతల్లో అయస్కాంత శక్తి (మాగ్నెటిక్ పవర్) ఉందని పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అన్నారు. గోసంరక్షణ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని భిల్వారాలోని శంభుపురా గ్రామంలో తులకి గోశాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోవులను గౌరవించడం మన సంస్కృతిలో భాగమన్నారు. గోవుల సంక్షేమం కోసం మరింత కృషి జరగాలని, పరిశోధనలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పూర్వం గోవులను సంరక్షించడం ద్వారా తల్లులు ఆరోగ్యంగా ఉండేవారని తెలిపారు. 
 
గతంలో రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన కటారియా.. గోవుల ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తిస్తుందని, ప్రతి ఇంట్లో వాటిని రక్షించే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోవులను రక్షించకపోతే దేశంలో వ్యవసాయం నాశనమవుతుందని ఆయన అన్నారు. పాఠ్యాంశాల్లో గోవుల గురించి చేర్చకపోవడం దురదృష్టకరమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అవినీతిని నిర్మూలించడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం వహించడంపై దైవ సంకల్పమని కటారియా అభివర్ణించారు. గతంలో పేదలకు చేరాల్సిన నిధులు అవినీతి కారణంగా చేరలేదని ఆయన అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్