Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గీతా ఆర్ట్స్‌లో డిజైనర్‌ అని మోసం చేశాడు.. బన్నీతో నటించే ఛాన్స్ ఇప్పిస్తానని?

Advertiesment
Cyber Criminals
, శుక్రవారం, 10 జులై 2020 (11:53 IST)
యువతులను మోసం చేసే ప్రబుద్ధుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహిళలపై అకృత్యాలు ఓ వైపు పెరిగిపోతుంటే.. మరోవైపు ఇలాంటి మోసాల సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇటీవల ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి పేరు చెప్పి అమ్మాయిలని మోసం చేసిన విషయం వెలుగులోకి రాగా, తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పేరుతో అమ్మాయిలకు ఓ ప్రబుద్ధుడు వల వేశాడు. గీతా ఆర్ట్స్‌లో తాను డిజైనర్, మేకప్ మేన్‌ అని చెప్పుకుంటూ అమ్మాయిలకి అనేక మాటలు చెప్పి మోసం చేశాడు.
 
ఈ విషయం గీతా ఆర్ట్స్ బేనర్ దృష్టికి రావడంతో వెంటనే గీతా ఆర్ట్స్ మేనేజర్ సత్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మోసం చేసిన వ్యక్తి వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడడంతో అతని లోకేషన్ ట్రేసింగ్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. 
 
దీనిపై విచారణ శరవేగంగా జరుగుతుందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. దర్యాప్తులో నిందితుడు.. పలువురు యువతులను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం ఇప్పిస్తానని మోసం చేసినట్లు తేలింది. ఇంకా యువతుల నుంచి భారీ మొత్తాన్ని గుంజేసివుంటాడని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డార్లింగ్ ఫ్యాన్సుకు శుభవార్త.. రాధే శ్యామ్ అంటూ వచ్చేసిన ప్రభాస్, పూజా లుక్