Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మంచి రసగుల్లా లాంటి సినిమా... 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు'

Advertiesment
Bhagyanagara Veedhullo Gammathu
, శనివారం, 28 సెప్టెంబరు 2019 (15:16 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మంచి హాస్యనటుడుగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో శ్రీనివాస రెడ్డి ఒకరు. ఈయన ఒకవైపు హాస్య భరిత పాత్రల్లో నటిస్తూనే మరోవైపు, దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అలా వచ్చిన చిత్రాలు "గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా, ఆనందో బ్రహ్మ" వంటి చిత్రాలు ఉన్నాయి. పైగా, ఇవి మంచి హిట్ సాధించాయి కూడా. 
 
అలాగే, ప్రముఖ యాంకర్ అన‌సూయతో క‌లిసి న‌టించిన 'స‌చ్చిందిరా గొర్రె' అనే సినిమా మేకింగ్ ద‌శ‌లో ఉంది. న‌టుడిగా బిజీగా ఉంటూనే ఇప్పుడు శ్రీనివాస‌రెడ్డి ఒకేసారి ద‌ర్శ‌క నిర్మాతగా అరంగేట్రం చేస్తుండ‌టం విశేషం. 'భాగ్య‌న‌గ‌ర వీధుల్లో గ‌మ్మ‌త్తు' పేరుతో శ్రీనివాస రెడ్డి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హాస్యాన్ని నమ్ముకుని పైకివచ్చిన శ్రీనివాసరెడ్డి... ఆ హాస్యాన్నే నమ్ముకుని ముందుకుసాగుతున్నాడు. 
 
ఈ కోవలో భాగ్యనగరిలో గమ్మత్తు అనే చిత్రాన్ని నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసి, సినిమాని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌కి తీసుకొని వచ్చాడు. 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా'కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన ప‌ర‌మ్ సూర్యంశునే ఈ చిత్రానికి క‌థ‌తో పాటు స్క్రీన్ ప్లే, మాట‌లు స‌మ‌కూరుస్తున్నాడు. 
 
ఇందులో ష‌క‌ల‌క శంక‌ర్, స‌త్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో ముగ్గురు హాస్య న‌టులు డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. ఇందులో నో యాక్ష‌న్, నో సెంటిమెంట్ ఓన్లీ కామెడీనే ఉంటుంద‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాడు భళ్లాలదేవ.. నేడు కాళకేయగా దగ్గుబాటి రానా