Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇండస్ట్రీ సమస్యలే కాదు పరిష్కారాలతో రమ్మన్న సీఎం రేవంత్ రెడ్డి

Dil Raju, Damodar Prasad, Sunil Narang and others

డీవీ

, సోమవారం, 29 జనవరి 2024 (17:34 IST)
Dil Raju, Damodar Prasad, Sunil Narang and others
సంక్రాంతి సినిమాల విడుదలపై ఇప్పటికి కూడా కొనసాగుతున్న కొన్ని అంశాల గురించి అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, గిల్డ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్ సీఎం రేవంత్ రెడ్డి  గారిని కలిసి ఇండస్ట్రీ గురించి చర్చించిన విషయాలు గురించి మాట్లాడటం జరిగింది.

ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్, వై వి ఎస్ చౌదరి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వివేక్ కూచిబొట్ల, ఏ కే ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాజేష్ పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా దిల్ రాజు గారు మాట్లాడుతూ : ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ముఖ్యమైన విషయాలు మీడియా షేర్ చేద్దామని. సంక్రాంతి సినిమాల బరిలో నుంచి ఛాంబర్ కోరగానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీ. జీ. విశ్వప్రసాద్,  వివేక్, హీరో రవితేజ ముందుకొచ్చి తమ రిలీజ్ డేట్ ని ఫిబ్రవరి 9కి మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు అదే ఫిబ్రవరి 9కి భైరవకోన తమ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ముందు ఈ విషయం ఛాంబర్ నోటీస్ కి రాలేదు వచ్చిన వెంటనే ఏ కాంటైన్మెంట్స్ అనిల్ సుంకరతో, రాజేష్ తో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఛాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని ఒక వారం రోజులు అంటే 16 ఫిబ్రవరికి మార్చుకోవడం జరిగింది. సంక్రాంతి అప్పుడు చాంబర్ వినతిని మన్నించి తమ డేట్ ని మార్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారికి ఇప్పుడు కూడా తమ డేట్ ని మార్చుకొని ఛాంబర్ వినితిని మన్నిస్తున్న ఏ కె ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. 
 
ఫిబ్రవరి 9కి రిలీజ్ అవుతున్న ఈగల్ కి ఎక్కువ శాతం థియేటర్స్ వచ్చేలాగా చూడడం జరుగుతుంది. అదే డేట్ కి యాత్ర 2 వాళ్ళు కూడా రిలీజ్ పెట్టుకున్నారు పొలిటికల్ ఇష్యూస్ మీద డేట్ ముందే ఫిక్స్ చేసుకోవడం వల్ల వాళ్లు డేట్ చేంజ్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అదేవిధంగా ఒక తమిళ్ సినిమా రజనీకాంత్  గెస్ట్రోలు ఆక్ట్ చేసిన లాల్ సలాం కూడా రిలీజ్ అవుతుంది. ఇదే విషయాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో చర్చించినప్పుడు పర్లేదండి మా సినిమాతో రెండు సినిమాలు రావడం పెద్ద ఇబ్బంది కాదు అని చెప్పి వాళ్ళు అనడం చాలా ఆనందం అనిపించింది. ఫిబ్రవరి 9 కి ఈగల్ మేజర్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. 
 
- నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. దాదాపు 1.15 నిమిషాలు సీఎం గారితో ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు గురించి చర్చించడం జరిగింది. దానికి సీఎం రేవంత్ రెడ్డి సమస్యలే కాదు సమస్యల పరిష్కారాలు కూడా మీరే తీసుకురండి ప్రభుత్వాన్ని నుంచి ఏం సహాయం కావాలన్నా చేయడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. ఉన్న సమస్యలన్నిటిమీద ఎల్లుండి ఈ సీ మీటింగ్ పెట్టుకుని దాంట్లో సమస్యలు అన్నిటికి పరిష్కారాలను తీసుకుని మళ్ళీ అతిత్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దీని గురించి వివరించడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన విధానం చాలా పాజిటివ్గా అనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన విధానానికి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎల్లుండి ఈ సీ మీటింగ్ లో ఈ విషయాల గురించి అన్నిటిని చర్చించి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక మంచి బ్రిడ్జి వేయడానికి నిర్ణయించుకున్నాము అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరోయిన్ ఫ్రెండ్ కోసం ఆడిషన్ కు వెళితే హీరోయిన్ ఛాన్స్ దక్కింది : శివానీ నాగరం