Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

anee master

ఠాగూర్

, శుక్రవారం, 18 అక్టోబరు 2024 (12:08 IST)
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై ఆయన శిష్యురాలు సృష్టి వర్మ లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో తాను షాక్‌లో ఉన్నట్టు మరో నృత్యదర్శకురాలు అని మాస్టర్ అన్నారు. జానీ మాస్టర్‌ అరెస్టుపై ఆమె శుక్రవారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, జానీ పై కేసు పెట్టడం నేను షాక్‌‍లో ఉన్నాను. నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ అవటం‌ బాధించిందన్నారు. అది తెలుగు టెక్నిషియన్‌కి ఇచ్చిన పురస్కారమన్నారు. 
 
జానీ తప్పు చేసినట్లు ఫ్రూవ్ కాలేదు.. నేను జానీ దగ్గర రెండు సంవత్సరాలు వర్క్ చేశాను.. జానీ మంచివారు.. ఎందుకో వారిపై ఆరోపణలు రావటం బాధాకారం.. తప్పు జరిగితే శిక్ష పడాలి.. కానీ జానీ నిరపరాధి అని తెలితే ఏంటి..!! లేడి కొరియోగ్రాఫర్‌గా చెబుతున్నా.. ఈ ఫీల్డ్‌లో ఎంతో కష్టం పడాలి. ‌కెరీర్‌లో ఎప్పుడు నాకు కాస్టింగ్ కౌచ్ అనేది ఎదురు కాలేదు. బాధితురాలు కొన్ని రోజుల వరకు జానీని దేవుడు అని చెప్పింది. 
 
జానీ మాస్టర్ వద్ద బాధితురాలు వర్క్‌లో చెసేప్పుడు హ్యాపీగా ఉండేది. కానీ సడెన్‌గా ఆరోపణలు చేయటాన్ని ఎలా చూడాలి..!! జానీ నాకు గురువు.. ఆయన ఈ జైలులో ఉండటం ఏమాత్రం కరెక్ట్ కాదనిపిస్తోంది. అమ్మాయి విషయం కాబట్టి సెన్సిటివ్ విషయం కాబట్టి.. ఎవరు మాట్లాడలేకపోతున్నారు? జానీపై ఇండస్ట్రీలోనే కుట్ర పన్నారనేది విషయంపై నేను మాట్లాడలేను. ఏ యూనియన్‌లోనైనా ఇష్యూస్ ఉంటాయి. డాన్సర్‌కు హెల్త్ ఇష్యూ వస్తే ఫస్ట్ హెల్ప్ చేసేది జానీ, శేఖర్, భాను మాస్టర్సే. డాన్స్ మాస్టర్స్ యూనియన్ ఎంతో బలంగా ఉంది. 
 
గతంలో బాధితురాలుకు డాన్స్ యూనియన్ కార్డ్ కోసం జానీ మాస్టర్ వైఫ్ గట్టిగా అడిగారు. విక్టిమ్‌కు కార్డ్ ఇవ్వాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి కదా, కానీ, జానీ అధ్యక్షుడుగా ఆమె కార్డ్ ఇవ్వకుండా తొక్కి పెట్టారనటం తప్పు. జానీ కేసు జడ్జిమెంట్ కోసం అందరం వెయిటింగ్, విక్టిమ్ గతంలో నాతో తనకు హీరోయిన్ అవ్వాలని ఉందని చెప్పింది. ముందు నువ్వు మంచి డాన్సర్ అవ్వమని చెప్పాను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?