ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురైంది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో ఇటీవల జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా... విచారణ అనంతరం ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. బాధితురాలిని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడిన కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ మాస్టర్ అరెస్టయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. జానీ మాస్టర్ అరెస్టయ్యాక నార్సింగి పోలీసులు కోర్టు అనుమతితో అతనిని నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు. మహిళా కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం, బెదిరింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.