Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంద‌మైన అనుభూతిని పంచుకున్న చిరంజీవి, సెటైర్ వేసిన అభిమాని

అంద‌మైన అనుభూతిని పంచుకున్న చిరంజీవి, సెటైర్ వేసిన అభిమాని
, సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (18:17 IST)
Chiranjeevi's House
మెగాస్టార్ చిరంజీవి మ‌న‌స్సు పిల్ల‌వాడిలాంటిద‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. ఆనంద‌మైన క్ష‌ణాల‌ను వెంట‌నే అంద‌రితో పంచుకుంటారు. సోష‌ల్‌ మీడియా తెలీన‌ప్పుడు ఆయ‌న‌తో వున్న స‌న్నిహితులు కుటుంబ స‌భ్యుల‌తో అలానే పంచుకునేవారు. ఇక సోష‌ల్‌మీడియా వ‌చ్చాక కొన్ని మ‌ధుర‌మైన అనుభూతుల‌ను షేర్ చేసుకుంటున్నారు.

ఆమ‌ధ్య కొరోనా స‌మ‌యంలో దేశ‌మంతా లాక్‌డౌన్ అయి ఎవ్వ‌రూ బ‌య‌ట‌కు వెల్ళ‌లేన‌ప్పుడు ఇంట్లోనే వుండి త‌న‌కు వ‌చ్చిన దోసెలు వేస్తూ, మ‌న‌వరాళ్ళ‌తో ఆడుకుంటూ కాల‌క్షేపం చేశారు. ఆయ‌నే కాకుండా త‌న అభిమానుల‌ను అందులో పాలుపంచుకునేలా చేశారు. ఇక ఈరోజు అంటే ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ సోమ‌వారం ఉద‌యం పూట త‌న ఇంటి కారిడార్‌లో నుంచి చూస్తే సూర్యోద‌యం రావ‌డాన్ని చాలా ఎక్స‌యిట్ అవుతూ ఆ ఆనందాన్ని అభిమానుల‌తో ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
 
మెగాస్టార్ ఇల్లు జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెం.25లో వున్న పెద్ద కొండ‌మీద వుంది. ఎంతోమంది ప్ర‌ముఖులు వున్న ఆ రోడ్‌లో ఆయ‌న ఇల్లు ప్ర‌త్యేక‌మైంది. కొండ అంచున వుంటుంది. దానికింద ఎన్నోచెట్లు, చేమ‌ల‌తో అందంగా క‌న్పిస్తుంది. అలాంటిది నాలుగు అంత‌స్తుల వున్న ఆ ఇంటిలో సెకండ్ ఫ్లోర్‌లో స్విమ్మింగ్ ఫూల్ వుంది. సూర్యోద‌యం అయితే ఎర్ర‌టి సూర్య బింబం స్విమ్మింగ్ ఫూల్ నీటిలో ప‌డి అందంగా క‌నిపిస్తుంది.

లాంగ్‌షాట్‌లో చూస్తే ఏదో న‌ది, చెరువో వున్న‌ట్లు అనుభూతి క‌లుగుతుంది. అందుకే ఈరోజు ఉద‌యం ఆ దృశ్యాన్ని చూసి త‌రించి ఆయ‌న ఈ విధ‌మైన కొటేష‌న్ పెట్టాడు. ``ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు లేదా శతాబ్దాలు ఉన్నా, సూర్యాస్తమయాలు, సూర్యోదయాల యొక్క ఖగోళ సౌందర్యం ఆశ్చర్యకరమైనవి. వాటి ఆనందం వివరించలేనివి, లెక్కించలేనివి. ఈ ఉదయం మా ఇంటి నుండి చూసినట్లుగా, అలాంటి మరొక క్షణం మీతో పంచుకుంటున్నా``నంటూ తెలిపారు.
 
అయితే ఆయ‌న ఆనందంతో మాకేంటి ప‌ని అనే వాళ్ళూ లేక‌పోలేదు. వెంట‌నే ఓ అభిమాని ఇలా స్పందించాడు. `సామాన్యుడు ఒకేరూంలో బతుకుతున్నాడు. నువ్వేమో నాకు ఇంత గొప్ప, పెద్ద ఇల్లు వుంది అనే గొప్పలకొసమేగా.  నువ్వేమో షూటింగ్ చేసుకుంటున్నావ్‌. దేశ ప్రజలు నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి అని గగ్గోలు పెడుతున్నారు. రైతులు డిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై ఉన్నారు
వీళ్ళకు మద్దతుగా ఒక్క సారైనా ట్వీట్ చేసావా.. నేను వీరాభిమానినంటూ.. ట్వీట్ చేశాడు. దీనిపై ఇంత‌వ‌ర‌కు చిరు స్పందించ‌లేద‌నుకోండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు గొలుసులు కట్టి `హౌస్ అరెస్ట్` చేస్తే!