చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రం ప్రమోషన్ ఇటీవలే అనంతపురం, ముంబై,లోనే జరిగాయి. ఇక రేపు విడుదలకాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ తెలుగు మీడియాకు మంగళవారం ఏర్పాటు చేశారు. ఇందులో సల్మాన్ రాకపోయినా చిత్రంలో నటించిన ఇతర నటీనటులు పాల్గొన్నారు. కొందరు చిరంజీవి దేవుడు అంటూ వారు తగినవిధంగా తెలియజేస్తే మరికొందరు పొగడ్తలతోపాటు రివ్యూలపై ఘాటు విమర్శలు చేయడం జరిగింది.
రాతలు, కూతలు కూయకండి
సీనియర్ నటుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రాణం ఖరీదు నుంచి చూస్తున్నాను. ఖైదీని కాలేజీ డేస్‌లో చూశాను. అలాంటిది మీ ముందు (చిరంజీవి) మాటలు రావడంలేదు. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. బిడ్డ పుట్టినప్పుడు వాడు ఏమవుతాడో చెబుతారు. కానీ పుట్టకముందు చంపేవారు వున్నారు. అలా పుట్టకముందే చంపేస్తున్నారు సినిమా రివ్యూలు రాసేవారు చెప్పేవారు. సినిమా కోట్లతో వ్యాపారం. ఎంతో మంది బతుకుతారు. గాడ్ ఫాదర్ విడుదలకాకపోముందే మీ ఇష్టం వచ్చిన రాతలు, కూతలు కూయకండి. రివ్యూల శాడిజం చూపించకండి. యూట్యూబ్‌లో మీకు వేలు రావచ్చు. అంటూ ఘాటుగా విమర్శించారు.
చిరంజీవిగారు గాడ్ బ్రదర్
నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ, దర్శకుడు గాడ్ ఫాదర్ అని పెట్టారు. కానీ గాడ్ బ్రదర్అని పెడితే బాగుంటుంది. చిరంజీవిగారు బ్రదర్ లాంటివారు. ఫాదర్ కాదు. చిరంజీవిగారి కాంబినేషన్‌లో మూడు రోజులు వందలాది మందితో షూట్ చేశాం. అక్కడ అంతా సైలెన్స్. మూడు రోజులు నేను గమనించాను. ఆయన నడుస్తుంటే ఆయనతోపాటు సీనియర్ సిటిజన్స్ లాంటి జూ.ఆర్టిస్టులు నడుస్తుంటారు. అందులో వారు చిరంజీవిగారి కాళ్ళమీద పడి మీరు దేవుడుఅంటూ దన్నం పెట్టుకున్నారు. కరోనా టైంలో ఎవరూ మమ్మల్ని ఆదుకోలేదు. మీరు తప్ప అంటూ వారు ఆనందబాష్పాలు రాల్చారు. 4వ రోజు చిరంజీవి వెళ్ళిపోయారు. ఇక అప్పటినుంచి సైలెన్స్‌ను కంట్రోల్ చేయలేకపోయాం. అప్పుడు అర్థమైంది చిరంజీవిగా స్టామినీ. గౌరవం. అంటే అని తెలిపారు.
నటుడు మహేష్ మాట్లాడుతూ, 30 ఏళ్ళుగా మీతో జర్నీ చేస్తున్నాను. నేను మీ వాడిని. నాకు చాలా గొప్ప అవకాశం వచ్చింది. ఇది మీరు ఇచ్చిన జీవితం. మీరు నాటిన మొక్క. పెద్ద నటుడ్ని అవుతానని చెప్పగలను అన్నారు.
చిరంజీవి కళ్ళలో కళ్లుపెట్టి చూశా - దియ
చిరంజీవిగారి సినిమాలో నటిస్తున్నావా అని నాకు వేలమంది ఫ్యాన్స్ అడిగారు. చెప్పగానే సంతోషించారు. నేను అంతకంటే ఫీల్ అయ్యాను. ఆయనతో ఓ సీన్ చేయాలి. చిరంజీవిగారి కళ్ళలో కళ్ళు పెట్టి డైలాగ్ చెప్పాలి. అది చెప్పగానే లోపల మురిసిపోయాను. ఇంటికెళ్ళి అమ్మనాన్నకు చెప్పాను. క్లోజ్ షాట్‌లో ఆయన నాతో మాట్లాడుతుంటే ఎలా మాట్లాడాలో కొన్ని సూచనలు చేశారు. ఊటీలో షూట్ చేస్తుండగా అమ్మ, నాన్న వచ్చారు. వారికి చిరంజీవిగారు గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోలేని మూవ్‌మెంట్.. అంటూ ఆనందం వ్యక్తం చేశారు.