Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అంటే ఇష్టం - నియా త్రిపాఠి

Advertiesment
Nia Tripathi
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (18:53 IST)
Nia Tripathi
ముంబైలో మోడలింగ్ కెరీర్ తర్వాత నేను హైదరాబాద్‌లో కొద్దిరోజులు ఉన్నాను. ఆ టైంలో నేను ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. కాస్టింగ్ డైరెక్టర్ మల్లికార్జున్ నా ప్రొఫైల్‌ని డైరెక్టర్ సర్ టీమ్‌కి పంపారు. అప్పుడు డైరెక్టర్ సార్ నన్ను పిలిచి సినిమాలోని ఓ సీన్ రిహార్సల్ చేసి పంపమన్నారు. ఆ సిన్ సార్ కి బాగా నచ్చింది అలా నాకు సినిమాలో అవకాశం వచ్చింది- అని నియా త్రిపాఠి తెలియ‌జేసింది. 
 
బలమెవ్వడు చిత్రంలో హీరోయిన్‌గా న‌టించిన నియా త్రిపాఠి, తన నటన  డాన్స్ ద్వారా అందరిని మెప్పించేందుకు సిద్ధంగా ఉంది.  నేను హిందీలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది త్వరలో తెలియ‌జేస్తా. మోడ‌ల్‌గా నేను మలబార్ గోల్డ్, సంతూర్ ప్రకటనల కోసం పనిచేశాను అని తెలిపారు.
 
-  మాది మధ్యప్రదేశ్. ప్రస్తుతం నేను ముంబైలో ఉంటున్నాను. చదువు విషయానికి వస్తే, నేను ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్‌లో ఇంజనీరింగ్ చేసాను, ఆపై నేను బెంగళూరు లో ఎంబీఏ లో ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్‌లో చేసాను. కానీ ఆఖరికి నటిగా సెటిల్ అయ్యా.
 
- హీరోల‌లో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ అంటే ఇష్టం.  హీరోయిన్‌ల‌లో సాయి పల్లవి, సమంత  ఇష్టం. సినిమాల్లో వాళ్ల పెర్ఫార్మెన్స్ నాకు చాలా ఇష్టం. తెలుగులో నాకు నచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి.
 
- ఈ సినిమాలో ఛాలెంజింగ్ పార్ట్ క్యాన్సర్ పేషెంట్‌గా నటించడం. ఎందుకంటే కాన్సర్ పేషంట్ గా నటించేటప్పుడు మనము చాలా ఎమోషన్స్‌ను అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు రోల్‌ కోసం నన్ను గుండు కొట్టుకోమన్నారు. దానికి నేను కూడా అంగీకరించాను. కానీ కంటిన్యూటీ సమస్య కారణంగా మళ్లీ డైరెక్టర్ సార్ మేకప్‌తో వెళ్తామని చెప్పాడు. కాబట్టి నాకు గుండె కొట్టుకోవాల్సిన అవసరం రాలేదు.  కానీ ఆ మేకప్ తో నన్ను నేను చూసుకున్నప్పుడు, జీర్ణించుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. కానీ ఆ సమయంలో నా మనసులో చాలా ఆలోచనలు రన్ అయ్యాయి. అసలు క్యాన్సర్ పేషెంట్లు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు మరియు వారు ఎంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు అని నేను ఆలోచించాను. నాకు, పాత్రలోకి ప్రవేశించడం, ఈ ఆలోచనల ద్వారా వెళ్లడం, భావోద్వేగాలను అనుభవించడం చాలా సవాలుగా అనిపించింది.
 
- నా ప్రత్యేకమైన హాబీ  డ్యాన్స్. శయమాక్ దవర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాను. చాలా డ్యాన్స్‌ ఫామ్స్‌ ట్రై చేస్తున్నాను. నేను కాంటెంపరరీ, హిప్ హాప్, జాజ్, సల్సా లో కూడా శిక్షణ పొందాను. డ్యాన్స్ నాకు చాలా ఇష్టం. ప్రేక్షకులందరికీ నా డాన్స్ ప్రతిభను చూపించాలనుకుంటున్నాను. తర్వాతి నాకు ఇష్టమైన హాబీ జ‌ర్నీ చేయ‌డం. కొత్త ప్రాంతాలు, కొత్త విషయాలు నేర్చుకోవడం సినిమాలు చూడడం కూడా చాలా ఇష్టపడతాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తోటివారితో వ‌ర్క్‌షాప్‌లో పాల్గొన్న హరిహర వీర మల్లు