Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Advertiesment
Chiranjeevi 157 movie title

దేవీ

, శుక్రవారం, 22 ఆగస్టు 2025 (12:05 IST)
Chiranjeevi 157 movie title
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు హైదరాబాద్ లో ప్రసాద్ ఐమాక్స్ లో 157 గ్లింప్స్ విడుదలచేశారు. ఈ చిత్రానికి మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దానికి ట్యాగ్ లైన్ గా పండగకు వస్తున్నారు అని పెట్టారు.  ఇక గ్లింప్స్  ఎలా వుందంటే.. ఇందులో చిరంజీవి పూర్తి సూట్ లో స్టయిలిష్ గా నడుస్తూ, సిగరెట్ తాగుతూ లుక్ ఇస్తూ అభిమానులను అలరించారు. ఈ గ్లింప్స్ భీమ్స్ సిరోలియో ఇచ్చిన బీజియమ్స్ బాగా సూటయ్యాయి. దీనికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ప్రత్యేకత సంతరించుకుంది.
 
అనంతరం చిత్రం గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ,  చిరంజీవి గారి ఘరనా మొగుడు, రౌడీ అల్లుడు వంటి సినిమాలు చూశాను. ఆయనతో సినిమా చేయాలనుకున్నా. ఈ సినిమాతో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవిగారిని  అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అంతకు రెట్టింపుగా వుటుంది.  వెంకటేష్ గారు ఆయన వాయిస్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఆయన వాయిస్ ఇచ్చారు. ఆయన ఎంట్రీ కూడా ఇవ్వబోతారు. అది పండగకు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాం. చిరంజీవిగారి మేనరిజం, పాట, ఆట ఎక్కడో చోట అందరూ అనుకరిస్తారు. మన శంకర వర ప్రసాద్ గారు పండుగకి వస్తున్నారు. 
 
చిరంజీవిగారిని సూట్ లో ఎలా వుంటారనేది నాకు చూడాలనిపించింది. అందుకే గ్లింప్స్ లో అలా చేశాం. సినిమాలో కూడా అంతకు మించి వుంటుంది. ఆయన వెయిట్ లాస్ అయి, రెండు పూటలు జిమ్ చేశారు. ఆయన ఒరిజినల్ చిరంజీవిగారే.. ఇక ఇందులో బిజీయిమ్ భీమ్స్ ఇచ్చారు. కెమెరా మెన్ కూడా అద్భుతంగా తీశారు. చిరంజీవిగారి మేనరిజాలు గత సినిమాల్లోవి అక్కడక్కడా వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఇందులో ఇంటిలిజెన్స్ ఆఫీసులో ఆఫీసర్ గా నటిస్తున్నారని తెలిపారు. దానికి ఎంటర్ టైన్ జోడించి ఫ్యాన్స్ కు విందులా వుంటుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ