Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేస్తున్న పృథ్వి.. #BurraKatha Theatrical Trailer (video)

Advertiesment
ఎన్టీఆర్‌ను ఇమిటేట్ చేస్తున్న పృథ్వి.. #BurraKatha Theatrical Trailer (video)
, మంగళవారం, 25 జూన్ 2019 (17:28 IST)
30 ఇయర్స్ పృథ్వి ఆ మధ్య ఓ సినిమాలో బాలయ్యను విపరీతంగా స్పూఫ్స్ రూపంలో ఇమిటేట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ హీరో అభిమానుల నుండి వచ్చిన స్పందన చూసి సైలెంట్ అయిపోయాడు. ఇమిటేషన్‌లు చేయడం చాలా వరకు తగ్గించేశాడు. ఈ విషయంగా స్వయంగా బాలకృష్ణ అతడిని హెచ్చరించినట్లు కొన్నాళ్లు చెవులు కొరుక్కున్నారు. 
 
కానీ దీని గురించి పెద్ద రాద్ధాంతం ఏమీ జరగలేదు. అయితే నిన్న విడుదలైన బుర్రకథ ట్రైలర్‌లో పృథ్వి సాహోలోని డై హార్డ్ ఫ్యాన్స్ డైలాగ్‌తో పాటు అరవింద సమేత వీర రాఘవలో ఎన్టీఆర్ ప్యాంటుకు కత్తి తుడుచుకునే స్టైల్‌ని ఇమిటేట్ చేశాడు. దీని గురించి అనేక మంది చాలా కామెంట్లు చేశారు.

ఇంకా సాహో విడుదల కాకముందే ఇలా చేయడం ఏమిటని కొందరు అడగగా, మరికొందరు మాత్రం దీనికి మద్దతు పలికారు. చేస్తే చేశావ్ బాగుంది అని పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇలా దానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ రావడం విశేషం. 
 
ముందు జాగ్రత్తగా దీనిపై పృథ్వి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ సినిమాలో తన పాత్ర విభిన్నమని, కేవలం ఆ సంఘటనను చూసి అవగాహనకు రావద్దని చెప్పారు.

డైమండ్ రత్నబాబు తనకు చాలా కీలక పాత్ర ఇచ్చారని చెప్పాడు. ప్రభాస్ తారక్‌లను అనుకరించడం గురించి పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు.
 
పృథ్వి అనవసరమైన ట్రోలింగ్‌కి చెక్ పెట్టడానికే ఇలా చెప్పినట్లున్నాడు. ఇదిలా ఉండగా బుర్రకథ ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఆది సాయికుమార్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలు పోషించిన ఈ మూవీలో మిస్త్రి చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ హీరోయిన్‌కు మణిరత్నం ఛాన్స్ ఇచ్చాడా... వైరల్ అవుతున్న రూమర్లు