Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్- 5.. నటరాజ్ మాస్టర్‌కి సర్పైజ్.. ఆ రెండు జంటల లవ్ ట్రాక్

Advertiesment
Bigg Boss Telugu 5
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (14:18 IST)
BB5
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్‌ని తన సతీమణి నీతూ శ్రీమంతం వీడియోతో బిగ్ బాస్ సర్పైజ్ ఇచ్చాడు. ఆ వీడియో చూసిన నటరాజ్ మాస్టర్‌తో పాటు ఇంటి సభ్యులు కూడా భావోద్వేగానికి గురైయ్యారు. అటు లోబోతో పాటు విశ్వా తన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు.
 
అంతకు ముందు బిగ్ బాస్ లక్సరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా నటరాజ్ మాస్టర్ విశ్వా ఒక్కడినే మొదట టాస్క్ ఆడాలంటూ సపోర్ట్ చేయడం ఆ టాస్క్‌లో విశ్వా విఫలం అవడంతో ఆ తరువాత విజే సన్నీ, రవి, ఆనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ మధ్య జరిగిన సంభాషణలో సన్నీపై సూటిపోటి మాటలతో తన ఆవేశాన్ని నటరాజ్ మాస్టర్ పరోక్షంగా చూపించిన సందర్భంలోనూ సన్నీ సంయమనం పాటించి తన ఆటతోనే నటరాజ్ మాస్టర్‌కి సమాధానం ఇచ్చాడు. లక్సరీ బడ్జెట్ టాస్క్‌లో సన్నీ అద్భుత ప్రదర్శన కనబరచగా, యాంకర్ రవి, శ్రీరామచంద్ర, శన్ముక్ జస్వంత్ లు ఫర్వాలేదనిపించారు.
 
ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆటలో పార్టిసిపేట్ చేయక, చేసేవాళ్ళని చేయనీయకుండా ఆట ముగిసిన తరువాత అందరికి మినిమం కామన్ సెన్స్ గురించి క్లాసులు పీకే నటరాజ్ మాస్టర్ పై ఉన్న ఇంటి సభ్యులకు ఉన్న కొద్దిపాటి రిలేషన్ రోజురోజుకు కూడా తగ్గిపోతుందని చెప్పడానికి రవి, సిరి హనుమంత్, జస్వంత్, ఆర్జే కాజల్ మధ్య సంభాషణతో పాటు సన్నీ, జెస్సీ, ప్రియ మాట్లాడుకున్నదాన్ని బట్టి అర్ధమవుతుంది. 
 
ఇక హౌస్‌లో వరస్ట్ పెర్ఫర్మార్‌గా మానస్‌కు ఎక్కువ ఓట్లు రావడంతో బిగ్ బాస్ ఆదేశంతో జైలుకు వెళ్తాడు. ఆ తరువాత ఒకపక్క ప్రియాంక సింగ్, మానస్ మధ్య ఒక ట్రాక్, హమిదా, శ్రీరామచంద్ర మధ్య మరో లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు వారి మాటల్లోనే అర్ధం అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వంద ఛీత్కారాల‌వ‌ర‌కు భ‌రిద్దాం అనుకున్నా. కానీః చంద్ర‌బోస్‌