Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

24న 'భీమ్లా నాయక్' ప్రీమియర్ షోలు - టిక్కెట్ ధర ఎంతంటే...

24న 'భీమ్లా నాయక్' ప్రీమియర్ షోలు - టిక్కెట్ ధర ఎంతంటే...
, మంగళవారం, 25 జనవరి 2022 (16:40 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సాగర్ కె చంద్ర కాంబినేషన్‌లో నిర్మితమైన "భీమ్లా నాయక్" చిత్రం వచ్చే నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ విడుదల తేదీకి ఒక్కరోజు ముందుగా అంటే ఫిబ్రవరి 24వ తేదీన అమెరికా, కెనడా దేశాల్లో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. ఈ చిత్రాన్ని ఈ రెండు దేశాల్లో ప్రైమ్ మీడియా సంస్థ విడుదల చేయనుంది. 
 
ఇదిలావుంటే, మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించగా, దగ్గుబాటి రానా విలన్‌గా నటించారు. జనవరి 12వ తేదీన రిలీజ్ కావాల్సివుండగా, అనివార్య కారణాల రీత్యా చిత్రాన్ని వాయిదా వేశారు. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటించగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడివాడలో క్యాసినో జరిగింది నిజమే... మంత్రి కొడాలి నానికి తమ్మారెడ్డి కౌంటర్