Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిగ్ బాస్ సీజన్ 5: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ బర్త్ డే స్పెషల్.. తండ్రి విషెస్‌తో..?

బిగ్ బాస్ సీజన్ 5: ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ బర్త్ డే స్పెషల్.. తండ్రి విషెస్‌తో..?
, శుక్రవారం, 8 అక్టోబరు 2021 (17:59 IST)
BB5
బిగ్ బాస్ సీజన్ 5 గురువారం ఎపిసోడ్‌లో ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్ పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ ఇచ్చిన సర్ ప్రైస్ తో ప్రియాంక ఆనందంలో మునిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ప్రియాంక సింగ్ మొదట్లోనే తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి కారణాలను ఇంటి సభ్యులకు వివరించడమే కాకుండా ఆ విషయాన్ని తన తండ్రికి ఆ విషయాన్ని ఎలా చెప్పాలో అర్ధంకాక బాధపడిన, భయపడిన పలు సందర్భాలను హౌస్ మేట్స్‌తో పంచుకున్న సంగతి తెలిసిందే.
 
గురువారం ఎపిసోడ్‌లో సాయితేజ నువ్వు అమ్మాయైన, అబ్బాయైన నువ్వే మా సర్వం నానా అంటూ ప్రియాంక సింగ్ తండ్రి మాట్లాడిన మాటలకు ఎమోషనల్‌గా చెప్పిన మాటలు అటు ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తున్నాయి. హమీదా ప్రవర్తనపై చిరాకు చెందిన ఆనీ మాస్టర్.. హమీదా - శ్రీరామ్ మధ్య రిలేషన్ గురించి మాట్లాడటమే కాకుండా ఇంట్లో పని అంత తానే చేస్తుందన్నట్లుగా ఫీల్ అవుతుందని ఆనీ మాస్టర్ హమీదాపై తన కోపాన్ని చూపిస్తుంది.
 
కెప్టెన్సీ టాస్క్ పూర్తి అయిన తరువాత బిగ్ బాస్ చివరిసారిగా ఇంటి సభ్యులు ఏ రాజుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారో చెయ్యొచ్చు అంటూ ఇచ్చిన చివరి అవకాశంలో విజె సన్నీకి 6 మంది, రవికి 7 మంది ఇంటి సభ్యులు సపోర్ట్ చేయడంతో రవిని బిగ్ బాస్ రాజ్యానికి రాజుగా ఎంపిక అయ్యాడు. ఆ తరువాత మానస్ మాట్లాడుతూ ఏ టీం నుండి అయితే ఈ వారం నామినేట్ అయిన వ్యక్తి ఎలిమినేషన్ అవరో వాళ్ళే నిజమైన రాజు అని, వారిదే అసలైన గెలుపని అంటాడు.
 
ఇక రవి టీం నుండి రవి, హమీదా, ఆనీ మాస్టర్, శ్వేతవర్మలు పోటీ పడగా బిగ్ బాస్ ప్రియకి కూడా ఈ వారం కెప్టెన్ అయ్యే అవకాశం ఇవ్వడం..దాంతో హమీదా ప్రియకి సపోర్ట్ గా పోటీ నుండి తప్పుకోవడంతో హమీదా స్థానంలో ప్రియ పోటీ చేయనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిఖిల్ హీరోగా యాక్షన్ స్పై సినిమా ప్రారంభం