ఉర్రూతలూగించిన 'బావలు సయ్యా...' గాయని ఇకలేరు...
సిల్క్ స్మిత బావలు సయ్యా... పాట అంటే అప్పట్లో కుర్రకారు వెర్రెక్కిపోయేవారు. సుమన్, కృష్ణంరాజు, మాలాశ్రీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన బావ బావమరిది చిత్రంలో బావలు సయ్యా.. హే మరదలు సయ్యా అనే పాటను ఆలపించిన గాయని రాధిక గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 47 సం
సిల్క్ స్మిత బావలు సయ్యా... పాట అంటే అప్పట్లో కుర్రకారు వెర్రెక్కిపోయేవారు. సుమన్, కృష్ణంరాజు, మాలాశ్రీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన బావ బావమరిది చిత్రంలో బావలు సయ్యా.. హే మరదలు సయ్యా అనే పాటను ఆలపించిన గాయని రాధిక గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 47 సంవత్సరాలు.
ఆమె శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కానీ ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమె తన కుటుంబంతో 2004 నుంచి చెన్నైలోని పాలవాక్కంలో వుంటున్నారు. ఈ రోజు ఆమె అంత్యక్రియలను చెన్నైలోని పాలవాక్కం శ్మశాన వాటికలో జరిగాయి. ఆమె మృతి పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.