Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో పరువు హత్య.. సహ విద్యార్థితో మాట్లాడిన కూతుర్ని సజీవంగా?

తెలంగాణలో పరువు హత్య చోటుచేసుకుంది. తన కుమార్తె తనకు ఇష్టమొచ్చినట్లు తిరుగుతుందని.. చెప్పిన మాట వినట్లేదని తండ్రే ఆమె పాలిట యముడయ్యాడు. కన్నకూతురును సజీవదహనం చేశాడు. ఆమెది ఆత్మహత్య చిత్రీకరించాడు. అయి

Advertiesment
తెలంగాణలో పరువు హత్య.. సహ విద్యార్థితో మాట్లాడిన కూతుర్ని సజీవంగా?
, బుధవారం, 20 సెప్టెంబరు 2017 (13:14 IST)
తెలంగాణలో పరువు హత్య చోటుచేసుకుంది. తన కుమార్తె తనకు ఇష్టమొచ్చినట్లు తిరుగుతుందని.. చెప్పిన మాట వినట్లేదని తండ్రే ఆమె పాలిట యముడయ్యాడు. కన్నకూతురును సజీవదహనం చేశాడు. ఆమెది ఆత్మహత్య చిత్రీకరించాడు. అయితే పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. ఏడో తరగతి చదివే అమ్మాయి పేరు రాధిక. ఆమె చదువుతో పాటు ఇతరత్రా పోటీల్లో మెరుగైన ప్రతిభను చూపేది. 
 
పాటలంటే ఆమెకు ప్రాణం. స్వరబద్ధంగా పాటలు పాడేది. అందుకు తగినట్లుగానే క్లాస్‌మేట్స్‌తో కలివిడిగా వుండేది. మంగళవారం పూట సహ విద్యార్థితో రాధిక మాట్లాడుతుండటాన్ని ఆమె తండ్రి నరసింహ చూశాడు. ఈ విషయంపై రాధికను నరసింహ నిలదీశాడు. అంతటితో ఆగకుండా నరసింహ రాధికపై చేజేసుకున్నాడు. రాధిక తలకు గాయం కావడంతో.. ఆపై తన భార్య లింగమ్మతో కలసి, రాధిక ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. 
 
తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని చెప్పి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చీ రావడంతోనే దీన్ని హత్యగా అనుమానించారు. తమదైన శైలిలో విచారించగా, తల్లిదండ్రులు నేరాన్ని అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేశారు. తన కుమార్తె కుటుంబ పరువును గంగలో కలుపుతుందేమోననే ఆమెను హత్య చేశామని.. దీనికోసం తాము బాధపడట్లేదని నరసింహ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ వ్యక్తికి పాము చుక్కలు చూపించింది.. ముఖంపై కాటేసింది.. చివరికి?