నందమూరి నట సింహం బాలకృష్ణ - ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి మూడవ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో బాలకృష్ణ బోయపాటితో చేయనున్న సినిమాని ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రాన్ని తన ఎన్.బి.కె బ్యానర్లో నిర్మించనున్నట్టు తెలియచేసారు బాలయ్య. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే... ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలను జరుపుకోనుందని సమాచారం. ఇక ఈ చిత్రం మొదటి షెడ్యూల్ లోనే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
రాజకీయాలతో పాటు సమాజంలోని కుళ్ళును ప్రశ్నించి ఎండగట్టే విధంగా మంచి పవర్‌ఫుల్‌గా ఈ సినిమా ఉంటుందట. మరి..సింహా, లెజెండ్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన బాలయ్య - బోయపాటి కాంబినేషన్ ఈసారి ఏం చేస్తారో చూడాలి.