Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలికి అవార్డ్: బాహుబలి-3 వుండదన్న శోభు యార్లగడ్డ

జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్లొరిడాలోని ఓర్లాండాలో జరిగిన ఎన్బీఏ బాస్కెట్ బాల్ పోటీల్లో కళాకారులు ''బాహుబలి'' పాటకు డ్యాన్

Advertiesment
Baahubali 3
, శుక్రవారం, 1 డిశెంబరు 2017 (12:50 IST)
జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా అనేక రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫ్లొరిడాలోని ఓర్లాండాలో జరిగిన ఎన్బీఏ బాస్కెట్ బాల్ పోటీల్లో కళాకారులు ''బాహుబలి'' పాటకు డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మమతల తల్లి పాటకు సాహోరే బాహుబలి అంటూ చేసిన నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 
ఈ విధంగా బాహుబలికి అంతర్జాతీయ వేదికలపై అరుదైన గౌరవం దక్కుతున్న వేళ.. తాజాగా బాహుబలి మరో అవార్డును అందుకుంది. ఈ క్రమంలో బాహుబలి సీఎన్ఎన్ ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2017గా ఎంపికైంది. గురువారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా నటి రమ్యకృష్ణ, నిర్మాత యార్లగడ్డ శోభులు ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. 2015లో ఇదే అవార్డును దర్శకుడు రాజమౌళి అందుకోగా, 2016కి గాను బాహుబలి సినిమాలో పనిచేసిన వారు ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ, త్వరలోనే ''బాహుబలి-3'' ఉంటుందని ఎవరూ భావించవద్దని చెప్పారు. 
 
రమ్యకృష్ణ మాట్లాడుతూ, బాహుబలిలో నటించిన అనుభవం జీవితాంతం మదిలో గుర్తుండిపోతుందని తెలిపారు. కాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి బిగినింగ్- ఎండింగ్‌లో.. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియీ, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 1,700 కోట్ల కలెక్షన్లను బాహుబలి సంపాదించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జవాన్ రివ్యూ రిపోర్ట్: కిక్ లేదు..