Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#AlaVaikunthapurramuloo రికార్డులు సృష్టిస్తున్న 'సామజవరగమన' సాంగ్

Advertiesment
#AlaVaikunthapurramuloo రికార్డులు సృష్టిస్తున్న 'సామజవరగమన' సాంగ్
, ఆదివారం, 20 అక్టోబరు 2019 (16:03 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో...'. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, ఈ చిత్రంలోని పాట ఆడియోను ఇటీవల విడుదల చేశారు. 
 
ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రానీ వ్యూస్, లైక్‌లను పొంది.. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ పాటను ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా.. ఎస్.ఎస్. థమన్ సంగీత బాణీలను సమకూర్చగా, సిద్ శ్రీరామ్ వినసొంపుగా ఆలపించాడు. ఈ సామజవరగమన సాంగ్ విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్, 313కే లైక్స్‌ను పొంది రికార్డును సృష్టించింది. 
 
తెలుగులో ఫస్ట్ సింగల్‌కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం ఇదే తొలిసారి. పాట విడుదలైన ప్రారంభం నుంచి గమనిస్తే.. మొదటి 35 నిమిషాల్లోనే 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. కాగా, ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్ వ్యూస్, 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక పాటకు ఈ తరహాలో లైక్స్, వ్యూస్ రావడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సాహో' దెబ్బకు ప్రభాస్ కొత్త చిత్రం బడ్జెట్ వ్యయం కుదించారు