Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరిప్పుడే కారు దిగారు... నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా... (Video)

Advertiesment
మీరిప్పుడే కారు దిగారు... నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా... (Video)
, గురువారం, 12 డిశెంబరు 2019 (13:15 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అల వైకుంఠపరుములో. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, బుధవారం ఈ చిత్రం టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
"మీ నాన్న పెళ్లి కూతురిని దాచినట్లు దాచాడు నిన్ను.. సరిగా చూడలేదెపుడు ముందుకు రా" అంటూ సాగే సంభాషణలతో షురూ అయ్యే ట్రైలర్ కొత్తగా ఉంది. అలాగే, టీజర్ ఆఖరులో "మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారెక్టర్ ఎక్కా" అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ పాత పగను తలపించేలా ఉంది. 
 
ఈ టీజర్‌ను ప్రధాన పాత్రల కాంబినేషన్‌లోని సన్నివేశాలపై రూపొందించారు. క్లాస్ లుక్‌తోను .. మాస్ లుక్‌తోను బన్నీ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా, క్లాస్ లుక్‌తో బన్నీ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. లవ్ .. కామెడీ .. యాక్షన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది. 
 
పూజా హెగ్డే ఆఫీస్‌లోనే బన్నీ పనిచేస్తాడనే క్లారిటీ అయితే ఈ టీజర్‌తో వచ్చేసింది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో 'టబు' కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
 
ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు, జయరామ్, సముద్రఖని కీలక పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిక్కుల్లో పడిన శ్రియ.. పోలీసులకు సారీ చెప్పడంతో వదిలేశారు..